Diwali: మీరు దీపావళి టపాసులు కొంటున్నారా.. అయితే.. కాల్చేందుకు ఈ నిబంధనలు పాటించాల్సిందే మరి...
ABN , First Publish Date - 2023-11-08T11:46:40+05:30 IST
రాజధాని నగరంలో దీపావళి సందర్భంగా టపాకాయలు పేల్చేందుకు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం
- టపాసులు కాల్చేందుకు మొత్తం 19 నిబంధనలు
ప్యారీస్(చెన్నై): రాజధాని నగరంలో దీపావళి సందర్భంగా టపాకాయలు పేల్చేందుకు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం(Greater Chennai Police Commissioner's Office) 19 నిబంధనలను ప్రకటించింది.
- సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పర్యావరణానికి హాని కలిగించని రసాయనాలతో తయారుచేసిన గ్రీన్ టపాసులు మాత్రమే విక్రయించాలి, కాల్చాలి.
- సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చాలి.
- పరిసరాల భద్రత చట్టం 89 కింద బాణసంచా కాల్చే ప్రాంతం నుంచి 4 మీటర్లకు తర్వాత 125 డెసిబుల్‌కు పైగా శబ్దం వచ్చే టపాసుల తయారీ, విక్రయించరాదు. అదే విధంగా చైనా టపాసులు ఎట్టి పరిస్థితుల్లోను విక్రయించరాదు.
- సులువుగా నిప్పంటుకొనే వస్తువులను భద్రపరచిన ప్రాంతం, మోటరు వాహనాలు పార్కింగ్ చేసిన ప్రాంతాలు, పెట్రోల్ బంక్‌లు, పెట్రోల్ నిల్వ ఉంచిన ప్రాంతాల్లో టపాసులు కాల్చరాదు.
- నిప్పంటించిన టపాసులను సరదా కోసం పైకి విసరరాదు. అదే విధంగా కాలుతున్న టపాసులను చేత్తో పట్టుకొని సాహసాలు చేయరాదు.
- జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో టపాసులు కాల్చరాదు.
- తగరపు డబ్బాలు, ఖాళీ బీరు సీసాల్లో రాకెట్ల్ పేల్చరాదు
- గుడిసెలున్న ప్రాంతాలు, అపార్ట్‌మెంట్ల వద్ద పైకి ఎగిరే రాకెట్ తదితర టపాసులు కాల్చరాదు.
- వెలుగుతున్న దీపం వద్ద టపాసులు ఉంచరాదు
- తడిసిన టపాసులను వంట గదిలో ఎండబెట్టరాదు.
- పెద్దల సమక్షంలోనే టపాసులు కాల్చాలి.
- బాణసంచా విక్రయించే దుకాణాల సమీపంలో ధూమపానం చేయరాదు. దుకాణంలో క్యాండిళ్లు, పెట్రోమాక్స్ లైట్లు, చిమ్నీలు వినియోగించరాదు.
- టపాసులు భద్రపరచిన ఇల్లు, దుకాణాల్లో అగరబత్తీలు వెలిగించరాదు.
- టపాసులు కాల్చేందుకు పొడవైన అగరబత్తీలు మాత్రమే ఉపయోగించాలి.
- పశువులు సేదతీరుతున్న ప్రాంతాల్లో టపాసులు కాల్చరాదు.
- దీపావళి పండుగ రోజుల్లో అగ్నిప్రమాదం, టపాసుల వల్ల ప్రమాదాలు జరిగితే 100, 101, 108, 112 అనే నెంబర్లకు ఫిర్యాదు చేయాల్సిందిగా చెనైకన పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్ కోరారు.