ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Future Of Work: జాబ్ ట్రెండ్‌ను మార్చేసిన కరోనా.. ఏడాది తర్వాత ఈ అయిదు ఉద్యోగాలకే యమా డిమాండ్.. నిరుద్యోగులూ.. బీ అలెర్ట్..!

ABN, First Publish Date - 2023-03-07T18:16:24+05:30

ఈ ఐదు రంగాలే భారతదేశ భవిష్యత్తును నిర్థేశించబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జీవితంలో మార్పు గురించి చెప్పాలంటే కరోనాకు ముందు కరోనా తరువాత అనే మాట టక్కున చెబుతారు. మనుషుల జీవితాల మీద కరోనా దెబ్బ చాలాదారుణంగా ఉందన్న విషయం వాస్తవం. అది సృష్టించిన విలయానికి ఎన్నెన్నో సంస్థలు నేలమట్టమైపోయాయి. ఎన్నో రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. కొందరు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తే మరికొందరు ఉద్యోగ పోరాటంలోనే ఉన్నారు. అయితే కాలం తెచ్చిన మార్పులకు తగ్గట్టు మనుషులు కూడా కొన్ని మార్చుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి అప్పుడే ఉద్యోగం సాధ్యం. వీటికి తగ్గట్టు ఈమధ్య కంపెనీలు వరుసపెట్టి ఉద్యోగస్తులను తొలగించడం ఉద్యోగ ప్రాధాన్యతలను చెప్పకనే చెప్పినట్టుంది. ఏడాది తరువాత అధిక డిమాండ్ ఉండే ఉద్యోగాల గురించి తెలిస్తే, ఆ ఉద్యోగాలకు ఎలా సన్నద్దం అవ్వాలో కూడా ప్లాన్ చేయోచ్చు. ఏ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందంటే..

1) ఉద్యోగస్తులకు నాలుగు విషయాల్లో అవగాహన ఉండాలని కెరీర్ గైడెన్స్ నిపుణులు చెబుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం(Technical Knowledge)

నిర్వహణ నైపుణ్యాలు(Management Skills)

కమ్యూనికేషన్ నైపుణ్యాలు(Communication Skills)

సమన్వయం నైపుణ్యాలు(Coordinating Skills)

ఈ నాలుగు ఉన్నవారికి ఉద్యోగం చాలా సులువుగా లభిస్తుంది. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్(Digital Marketingmanager), బిజినస్ అనలిస్ట్(Business analyst), ప్రాజెక్ట్ మేనేజర్(Project manager), కస్టమర్ సక్సెస్ మేనేజర్(Customer Service Manager), ఆపరేషన్ అనలిస్ట్(Operation Analyst) మొదలైన జాబ్స్ పైన చెప్పుకున్న నాలుగు నైపుణ్యాల ఆధారంగానే సాగుతాయి.

Read also: Train Journey Rules: రైలు ప్రయాణాలు చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్.. రాత్రి 10 తర్వాత టికెట్లను టీటీఈ ఎందుకు చెక్ చేయరంటే..


2) కోవిడ్ వల్ల డిజిటల్ టెక్నాలజీ వేగం పెరిగింది. ఇప్పుడు చాలా కార్యకలాపాలు ఆన్లైన్(Online) లో జరిగిపోతున్నాయి. బట్టల దగ్గర్నుండి, నిత్యావసరాల కొనుగోలు వరకు ప్రతి దానికోసం ఇదే తీరు సాగుతోంది. ఇది వెనక్కు తగ్గే సూచనలేమీ లేవు, కాబట్టి ఈ-కామర్స్(E-Commerce), ఐటీ రంగాలు(IT Field), వీటికి సంబంధించి ఇతర రంగాల్లో నిపుణుల డిమాండ్ పెరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా వెబ్సైట్ డవలపర్స్(Website Developers), ప్రోగ్రామర్స్(Programmers), సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్స్(Syber Security Specialist), కంటెంట్ రైటర్స్(Content Writers), కంటెంట్ క్రియేటర్స్(Content Creaters), డ్రోన్ ఫైలటింగ్(Drone piloting), డ్రోన్ ఫోటోగ్రఫీ(Drone Photography), డ్రోన్ మ్యాపింగ్(Drone Maping) మొదలైన ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయి.

3) ఒకప్పుడు తిండి, నీళ్ళు పక్కన పెట్టి డబ్బు సంపాదనే అంతిమ లక్ష్యం అన్నట్టు ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు అందరూ.. ఆరోగ్యం మీద స్పృహ పెరిగింది. దీంతో ఏ సమస్య వచ్చినా వైద్యులను తప్పనిసరిగా కన్సల్ట్ అవుతున్నారు. జబ్బులు ఏవీ రాకూడదనే అలోచనతో ముందుగానే ఫిట్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఫిజియోథెరపిస్టులు, జిమ్ ట్రైనర్ లు, పోషకాహార నిపుణులు, ఫిజీషియన్లు, యోగా టీచర్లు ఇలా వైద్య విభాగంలో అన్నిరకాల ఉద్యోగాలకు మంచి అవకాశాలుంటాయి.

4) విద్యుత్ లేకుండా ఏ దేశం ముందుకు కదలదు. భారతదేశం 2030 సంవత్సరం నాటికి 450గిగావాట్ల విద్యుత్(450GW) ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా సోలార్(Solar), పవన విద్యుత్(Wind Power), జలవిద్యుత్(Hydroelectricity) సహా ఇతర విద్యుత్ ఉత్పత్తి రంగాలలో అవకాశాలు చాలా ఉంటాయి. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా(Austrila), బ్రెజిల్(Brazil), జర్మనీ(Germany), ఫ్రాన్స్(France) వంటి 13దేశాలలో అవకాశాలను కల్పిస్తుంది.

5) 2002 నుండి 2012 సంవత్సరాల మధ్య కాలం గమనిస్తే చాలా మంది వ్యవసాయం(Agriculture) చేసుకునేవారు మట్టి పిసుక్కుంటూ ఎన్నాళ్ళు వ్యవసాయం చేసినా బాగుపడేది ఏం ఉండదని అభిప్రాయపడేవారు. ఈ కారణంతో వ్యవసాయం నుండి క్రమంగా ఉద్యోగాల వైపుకు వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పెద్ద చదువులు చదివి చివరకు సేంద్రియ వ్యవసాయం, నూతన సాగు పద్దతులలో పంటలు పండించి సక్సెస్ అవుతున్న యువత చాలామంది ఉన్నారు. తొందరలోనే వ్యవసాయ రంగం ప్రధాన ఉపాధి రంగంగా మారుతుంది. దీంతో పాటు రవాణా వ్యవస్థ(Transportation) మరింత బలోపేతం కానుంది. వీటికి భారీ పెట్టుబడులు పెట్టాలనే ప్రభుత్వ ప్రణాళికలు దీనికి మరింత బలం చేకూర్చుతోంది.

ఈ ఐదు రంగాలే భారతదేశ భవిష్యత్తును నిర్థేశించబోతున్నాయి.

Updated Date - 2023-03-07T18:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising