Innovative Awareness: రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు.. ఆశతో తీసుకుందామనుకుంటే మాత్రం అంతే సంగతులు.. వైరల్ వీడియో
ABN, First Publish Date - 2023-09-13T13:40:14+05:30
సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) సైబర్ నేరాలపై వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల (Social Media) లో వైరల్ అవుతున్నాయి.
ఇంర్నెట్ డెస్క్: సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) సైబర్ నేరాలపై వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల (Social Media) లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలను గమనిస్తే.. రూ.500 నోటు ఉన్న పర్సులాంటి ఒక బ్రోచర్‌ను రోడ్డుపై వేస్తున్నారు. తీరా ప్రజలు ఆ దాన్ని పర్సు అనుకుని తెరిచి చూస్తే 'సైబర్ నేరాలపై 1930కు కాల్ చేయాలని' సమాచారం ఉంటుంది. అంతేగాక అసలుకు, నకిలీకి మధ్య తేడాలు గుర్తించాలని, ఆశపడకుండా అప్రమత్తంగా ఉండాలనే సందేశం కూడా అందులో ఉంటుంది. అచ్చం ఈ పర్సులానే ఆన్‌లైన్ మోసాలు (Online Frauds) కూడా ఉంటాయని, ఆశపడి అలాంటి వాటి మాయల్లో పడి మోసపోవద్దని ప్రజలకు ఈ బ్రోచర్ ద్వారా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
1930పై ప్రజలకు మరింత అవగాహన కల్పించటంలో భాగంగానే సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలోనే ఈ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నెంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ కొనసాగుతోంది. అత్యాధునిక టెక్నాలజీ, 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్‌సెంటర్ పనిచేస్తోంది.
UK: బ్రిటిష్ బామ్మకు జాక్‌పాట్.. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు!
Updated Date - 2023-09-13T13:40:14+05:30 IST