Prajavani : ప్రజావాణి కార్యక్రమంలో యువకుడు వింత ఫిర్యాదు.. ‘నువ్వు సల్లగుండాలయ్యా..’ అని దండం పెడుతున్న నెటిజన్లు.. ఇదీ అసలు కథ..!
ABN, First Publish Date - 2023-02-27T21:23:39+05:30
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ప్రజావాణి’ (Prajavani) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీవారం ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్లు (District Collectors) పరిష్కరించేందుకు..
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ప్రజావాణి’ (Prajavani) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీవారం ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్లు (District Collectors) పరిష్కరించేందుకు నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు. ఈ కార్యక్రమం తెలంగాణ (Telangana) వ్యాప్తంగా చాలా రోజులుగా నడుస్తోంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయ్.. వీటిలో కొన్ని సమస్యలు గంటల వ్యవధిలోనే పరిష్కారం అవుతుండగా.. మరికొన్ని ఒకట్రెండ్రోజుల్లోనే అవుతున్నాయి. అయితే ఈ ప్రజావాణిలో ఓ యువకుడు చేసిన ఫిర్యాదుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కంగుతిన్నారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫిర్యాదు కథేంటో చూద్దాం రండి..
ఇదీ అసలు కథ..
జగిత్యాల జిల్లాలో (Jagtiyal) సోమవారం నాడు ‘ప్రజావాణి’ కార్యక్రమం జరిగింది. ఇక్కడికి వెళ్లిన భీరం రాజేష్ యువకుడు కింగ్ ఫిషర్ బీర్లు (King Fisher Beers) అమ్మడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో చల్లని బీర్లను (Cool Beer) అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు. అసలు ఈ బీర్లే ఎందుకు అడుగుతున్నాడనే దానిపై ఫిర్యాదులో పెద్ద వివరణే ఇచ్చాడు. ‘జగిత్యాల జిల్లాలో కల్తీ మద్యం, నాసిరకం బీర్లు అమ్ముతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అందులో ఒక్కో బీర్‌కు రూ. 200 నుంచి 300 వరకు వసూలు చేస్తూ ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారు. ఆ బెల్ట్ షాపులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వైన్ షాపుల్లో దొరక్కుండా బెల్టు షాపులలో బీర్లు దొరుకుతున్నాయి. అయితే బెల్టు షాపుల్లో అమ్మేవి ఒరిజినలా? నకిలీవా? అనేది అర్ధం కావడం లేదు. పైగా దుకాణాదారులు వారికి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. కేఎఫ్ బీర్ల కోసం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. దుకారణదారులు వారికి ఇష్టం వచ్చిన మద్యం మాత్రమే అమ్ముకోవడానికి హక్కు ఎక్కడిది..? ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వారు మాత్రమే మద్యం అమ్మాలనే హుకుం జారీ చేసి అధికారులు ప్రభుత్వానికి ఆదాయంలో నష్టం వచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జగిత్యాల పట్టణంలో అన్ని రకాల బీర్లు అమ్మేవిధంగా చర్యలు తీసుకోవాలి’ అని రాజేష్ విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదులో కింద మొబైల్ నంబర్ కూడా రాశాడు.
కామెంట్ల మోత మోగుతోందిగా..!
ప్రస్తుతం రాజేష్ వినతిపత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదేం ఫిర్యాదురా బాబోయ్ అని కొందరు నెటిజన్లు షాకవుతుంటే.. మందుబాబుల తరపున తన వాణి వినిపించాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు.. బ్రో మీరు సూపరంతే అని మెచ్చుకుంటున్నారు. ఇక మద్యం ప్రియులైతే.. ‘అయ్యా మీరు దేవుడయ్యా దండేసి దండం పెట్టాలి’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘కేఎఫ్ బీర్ లవర్స్ ఇది మెచ్చుకోవాల్సిందే’.. ‘నిజంగా చాలా సీరియస్ విషయం.. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి’.. ‘ఇది హార్ట్ టచింగ్’.. ‘రేయ్.. ఎవర్రా మీరంతా’.. అని ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్‌తో సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. ఇక మీమ్స్ అయితే పేలిపోతున్నాయ్. మరికొంతమంది మాత్రం ఫిర్యాదు చేయడానికి ఇంకేం సమస్యలు లేవా? అంటూ రాజేష్‌పై మండిపడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
Vangaveeti Radha : వంగవీటి రాధా పార్టీ మారుతున్నారా.. ముహూర్తం కూడా ఫిక్సయ్యిందా.. ఓహో మాస్టర్ ప్లాన్ ఇదా..!?
******************************
Telugudesam : టీడీపీ వైపు మాజీ మంత్రి చూపు.. ఎమ్మెల్యేగా పోటీచేయాలని ప్లాన్.. ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!
******************************
Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్
******************************
Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!
******************************
Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో
******************************
TS Congress : ‘కోమటిరెడ్డి ఎవడు.. నాకు తెలియదు..’ ఎంపీని షబ్బీర్ అలీ ఇంత మాట అనేశారేంటి.. ఎందుకింత రచ్చ..!?
******************************
Viveka Murder Case : పీకలదాకా వచ్చేసరికి సిల్లీ లాజిక్స్ ఏంటి సజ్జలా.. అసలేంటీ మాటలు.. నవ్వుకుంటున్నారు బాబోయ్..!
******************************
Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!
******************************
Updated Date - 2023-02-27T21:46:43+05:30 IST