ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Metro: మెట్రోలో ఇలా మాత్రం చేయకండి! వీడియో వైరల్ అయిందని యువకుడు సంతోషించే లోపే భారీ షాక్!

ABN, First Publish Date - 2023-10-08T16:01:57+05:30

ప్రాంక్ వీడియోల పేరిట రోగం వచ్చినట్టు నటిస్తూ మెట్రోలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మహిళలను భయాందోళనకు గురి చేసిన ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి రూ.500 జరిమానా విధించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోల బెడద తీవ్రమైంది. రోడ్డు మీద తమమానాన తాము వెళుతున్న వారిని ప్రాంక్ వీడియోల పేరిట రకరకాల ఇబ్బందులు పాలు చేసే వారు ఎక్కువైపోయారు. ఫన్ పేరిట చేస్తున్న ఈ వీడియోలు అనేక సందర్భాల్లో అవతలి వారికి చికాకు కలిగిస్తున్నాయి. అయితే, వ్యూస్ కోసం.. పాప్యులారిటీ కోసం కొందరు అదే పంథా కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి ఓ గుణపాఠమే ఈ బెంగళూరు(Bengaluru) యువకుడి ఉదంతం. ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ యువకుడిపై నెటిజన్లు మిమర్శలు గుప్పిస్తున్నారు. తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు(Youth arrested for spooking woman in metro train). ఇంతకీ జరిగిందేంటే..

Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..


బెంగళూరుకు చెందిన ప్రజ్వల్‌కు ప్రాంక్ వీడియోలు(Prank Video) చేయడం అలవాటు. అతడి ఇన్‌స్టాలో బోలెడన్నీ ప్రాంక్ వీడియోలు ఉన్నాయి. జులైలో కూడా అతడు మెట్రో స్టేషన్‌లో ప్రాంక్ వీడియో చేశాడు. అకస్మాత్తుగా ఏదో అనారోగ్యం వచ్చినట్టు మహిళ ప్రయాణికుల ముందు కూలబడిపోయి నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో ఘటన మొత్తం రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ అయ్యింది. మరోవైపు, నెటిజన్లు యువకుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇది పద్ధతి కాదంటూ మండిపడ్డారు.

Viral: మహిళ చేసిన పనికి ఒక్కసారిగా కన్‌ఫ్యూజ్ అయిపోయిన దున్నపోతు.. ఏం చేయాలో తెలీక..

ఈలోపు ఘటనపై దృష్టిపెట్టిన మెట్రో అధికారులు అతడి ప్రాంక్ వీడియో ఘటనకు సంబంధించి ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు గురువారం నిందితుడిని పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించినందుకు అరెస్టు చేశారు. ఆ తరువాత అతడిపై రూ.500 జరిమానా విధించారు. ప్రాంక్ వీడియోల్లోని అతడి బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు యువకుడి ఆచూకీ పట్టుకున్నారు.

Updated Date - 2023-10-08T16:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising