Viral Video: గుండెపోటు వచ్చే ముందు ఇలా ఉంటుందా?.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN , First Publish Date - 2023-01-06T17:56:04+05:30 IST

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు (Heart Attack) బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అప్పటి వరకు సాధారణంగా ఉన్న వారు ఎలాంటి లక్షణాలూ లేకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: గుండెపోటు వచ్చే ముందు ఇలా ఉంటుందా?.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు (Heart Attack) బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అప్పటి వరకు సాధారణంగా ఉన్న వారు ఎలాంటి లక్షణాలూ లేకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే ఓ షాకింగ్ వీడియో (Shocking Video) నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. హర్యానా (Haryana)లోని ఓ మెడికల్ షాప్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫరీదాబాద్‌లోని ఓ మెడికల్‌ దుకాణానికి సంజయ్ అనే యువకుడు మందుల కోసం వెళ్లాడు. అప్పటికే సంజయ్ బాగా నీరసంగా ఉన్నాడు. ఛాతిపై చేతితో రద్దుకుంటున్నాడు. మందుల దుకాణం వ్యక్తిని ఓఆర్ఎస్ ప్యాకెట్ అడిగాడు. దుకాణదారుడు ప్యాకెట్ తెచ్చి టేబుల్‌పై పెట్టే సమయానికి సంజయ్‌కు నొప్పి ఎక్కువైంది. దీంతో వెంటనే దుకాణం ముందే కుప్పకూలిపోయాడు (Man dies of heart attack at medical store). వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించగా గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కిందపడిపోవడానికి ముందు గుండెపోటు వల్ల సంజయ్ పడిన బాధ మొత్తం దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ (Viral Video) అవుతోంది.

Updated Date - 2023-01-06T17:56:05+05:30 IST