VandeBharat: వైరల్ వీడియో.. పాపం.. ‘వందేభారత్’తో సెల్ఫీ కోసం ట్రై చేసి..
ABN , First Publish Date - 2023-01-17T21:02:00+05:30 IST
వందేభారత్‌లో సెల్ఫీ కోసం ట్రై చేసిన ఓ వ్యక్తి ఊహించని సమస్యలో పడ్డాడు.. నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో.
ఇంటర్నెట్ డెస్క్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express).. ప్రయాణికులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన రైలు సర్వీసు. చాలా మందికి ఈ రైలు ప్రయాణం తాలూకు అనుభూతి ఎలా ఉంటుందో ఇంకా తెలీదు. ఇటీవలే ఈ సర్వీసు తెలుగు ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం(Visakhapatnam), హైదరాబాద్(Hyderabad) మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై తెలుగు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అందుకే.. కొందరు రైలుతో సెల్ఫీ(Selfie) దిగేందుకు తాపత్రయపడుతున్నారు. సరిగ్గా ఇలాగే సెల్ఫీ కోసం బాగా ఉబలాటపడ్డ ఓ వ్యక్తి ఊహించని సమస్యలో చిక్కుకుపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral) అవుతోంది. ‘వందే భారత్’లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి అలా అలా కోచ్‌లోపలకు వెళ్లిపోయాడు. సెల్ఫీ తీసే క్రమంలో పూర్తిగా లోకాన్ని మర్చిపోయాడో ఏమో గానీ.. అతడు లోపల ఉండగానే రైలు కదలింది. అత్యాధునిక భద్రతా వ్యవస్థలున్న రైలు కావడంతో తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకుపోయాయి. దీంతో.. మనోడు ట్రైన్‌లో చిక్కుకుపోయాడు.
అటుగా ఓ టీసీ వస్తూ కనిపించడంతో అతడిని శరణువేడాడు. తలుపు తెరవాలంటూ విజ్ఞప్తి చేశాడు. కానీ.. ఎప్పుడుపడితే అప్పుడు తలుపులు తెరుచుకోవని టీసీ తేల్చి చెప్పడంతో పాపం ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. రైలు చివరి గమస్యస్థానాన్ని చేరే వరకూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమోనని అతడు తెగ భయపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.