Viral Video: ఏం స్పీడ్ రా బాబు.. ఇలాంటోళ్లు బ్యాంకుల్లో ఒక్కరున్నా సరే.. కస్టమర్ల కష్టాలు తగ్గేవి..!
ABN , First Publish Date - 2023-04-14T13:12:59+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రోజుకు వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎందరో అనామకుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రోజుకు వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎందరో అనామకుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. నమ్మశక్యం కాని వారి స్కిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓ ఫార్మసీలో బిల్లు వేసే ఓ ఉద్యోగికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Pharmacy staffer typing speed).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) ఓ మందుల షాప్ (Pharmacy) ముందు జనం బారులు తీరి ఉన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది మెరుపు వేగంతో ట్యాబ్లెట్ల పేర్లను కంప్యూటర్లో టైప్ చేసి బిల్లు తీస్తున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అతడు నిజంగా టైప్ చేస్తున్నాడా? లేక కీ బోర్డుపై వేళ్లను బ్రేక్ డ్యాన్స్ చేయిస్తున్నాడా? అనిపిస్తుంది. రోబోకు సాధ్యం కాని వేగంతో అతడు అత్యంత స్పీడ్‌గా (typing speed) టైప్ చేస్తున్నాడు. అతడి స్పీడ్‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Heart Touching Story: ఒక్కసారి కలవాలంటూ వెతుక్కుంటూ వచ్చిన స్కూల్ ఫ్రెండ్.. కాసేపయ్యాక ఏడుస్తూనే 50 ఏళ్ల నుంచి దాచిన నిజాన్ని చెప్పి..
ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడు మనిషా? రోబోనా?
అని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు బ్యాంకులో ఒక్కరున్నా సరే కస్టమర్లకు కష్టాలు తగ్గుతాయని మరొకరు పేర్కొన్నారు. అలాగే అతడి స్పీడ్ నమ్మశక్యం కాని రీతిలో ఉందని, తన కళ్లను తనే నమ్మలేకపోయానని ఇంకొకరు ప్రశంసించారు. ఈ వీడియో ట్విటర్‌లో 47 లక్షల వ్యూస్ దక్కించుకుంది.