Pregnant Woman: దేవుడా.. మరీ ఇంత దారుణమా..? నిండు గర్భిణిపై నుంచి వెళ్లిన ట్యాంకర్.. కడుపులోంచి బయటకు వచ్చిన పసికూన..!

ABN , First Publish Date - 2023-06-26T18:56:06+05:30 IST

బీహార్‌లోని సహర్సాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డాక్టర్ చెకప్ కోసమని బైక్‌పై వెళ్తున్న గర్భిణిని ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఆ మహిళ పై నుంచి ట్యాంకర్ వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో మహిళ మృతి చెందగా, రోడ్డు పైనే ఆమె గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చేసింది.

Pregnant Woman: దేవుడా.. మరీ ఇంత దారుణమా..? నిండు గర్భిణిపై నుంచి వెళ్లిన ట్యాంకర్.. కడుపులోంచి బయటకు వచ్చిన పసికూన..!

బీహార్‌ (Bihar)లోని సహర్సాలో ఘోర రోడ్డు ప్రమాదం (Shocking Road accident) జరిగింది. డాక్టర్ చెకప్ కోసమని బైక్‌పై వెళ్తున్న గర్భిణిని (Pregnant Woman crushed by a tanker) ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఆ మహిళ పై నుంచి ట్యాంకర్ వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో మహిళ మృతి చెందగా, రోడ్డు పైనే ఆమె గర్భం నుంచి బిడ్డ (Infant)బయటకు వచ్చేసింది. ఆ నవజాత శిశువు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన స్థానికంగా ఎంతో మందిని కలిచివేస్తోంది (Crime News).

రొటీన్ చెకప్ కోసమని ఆ గర్భిణి తన భర్తతో కలిసి డాక్టర్ దగ్గరకు బయల్దేరింది. సహర్సా-సుపాల్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పింది. నేరుగా బైక్‌ పైకి వచ్చింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే ట్యాంకర్ మహిళపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ కడుపులోని బిడ్డ కడుపులో బయటకు వచ్చింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త, నవజాత శిశువును స్థానిక ప్రజలు అంబులెన్స్‌లో సహర్స సదర్ ఆసుపత్రికి తరలించారు.

Crime: మాజీ ప్రేయసి ఫోన్ చేసి కలుద్దామనగానే.. అనుమానించకపోవడమే ఆ కుర్రాడి పొరపాటయింది.. కారులో కూర్చోగానే కూల్ డ్రింక్ ఇచ్చి..!

నవజాత శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో ఆ మహిళ భర్త షాక్‌కు గురయ్యాడు. భార్య చనిపోవడంతో బిడ్డ అయినా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-06-26T18:56:06+05:30 IST