Marriage: ఒకే మండపంలో ఇద్దరు వధువులు.. పెళ్లి కొడుకు మాత్రం ఒక్కడే.. ఈ ప్రేమ పెళ్లికి బంధువులంతా సాక్షులే..!

ABN , First Publish Date - 2023-06-26T19:14:24+05:30 IST

రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఓ విచిత్ర వివాహం జరిగింది. ఆ వివాహ వేడుకలో ఒకే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లికి ముగ్గురు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ప్రశాంతంగా జరిగిపోయింది. వధువులిద్దరూ వరుడిని పంచుకోవడానికి సిద్ధమయ్యారు.

Marriage: ఒకే మండపంలో ఇద్దరు వధువులు.. పెళ్లి కొడుకు మాత్రం ఒక్కడే.. ఈ ప్రేమ పెళ్లికి బంధువులంతా సాక్షులే..!

రాజస్థాన్‌ (Rajasthan)లోని బన్స్వారా జిల్లాలో ఓ విచిత్ర వివాహం (Weird Marriage) జరిగింది. ఆ వివాహ వేడుకలో ఒకే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు (Groom married two girls). ఆ పెళ్లికి ముగ్గురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వధువులిద్దరూ వరుడిని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో గిరిజన సంప్రదాయం ప్రకారం వరుడు వారిని వివాహం చేసుకున్నాడు. విశేషమేమిటంటే.. ఇద్దరిలో ఒక అమ్మాయితో 20 ఏళ్ల నుంచి, మరో అమ్మాయితో 9 ఏళ్ల నుంచి వరుడు సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు.

ఆనందపురి ప్రాంతంలోని ఉపల్‌పాడ గ్రామానికి చెందిన కమలేష్ అనే వ్యక్తి 13 సంవత్సరాల వయసులో నాని దేవి అనే బాలికతో ప్రేమలో పడ్డాడు. సంవత్సరం తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకొచ్చాడు. వారిద్దరికీ 8 ఏళ్ల కూతురు ఉంది. తొమ్మిదేళ్ల క్రితం టీనా అనే మహిళకు అకర్షితుడయ్యాడు. ఆ తర్వాత ఆమెను కూడా ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెకు ఓ కొడుకు పుట్టాడు. భార్యలు ఇద్దరినీ ఒకే ఇంట్లో ఉంచి కాపురం చేశాడు. అయితే ఇద్దరినీ పెళ్లి చేసుకోలేదు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల అప్పట్లో కమలేష్ వివాహ వేడుక చేసుకోలేదు.

Pregnant Woman: దేవుడా.. మరీ ఇంత దారుణమా..? నిండు గర్భిణిపై నుంచి వెళ్లిన ట్యాంకర్.. కడుపులోంచి బయటకు వచ్చిన పసికూన..!

ముగ్గురూ కష్టపడి పని చేసి డబ్బులు వెనకేసుకోవడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధపడ్డారు. తాజాగా ఇద్దరినీ ఒకే మండపంలో కమలేష్ పెళ్లి చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గిరిజన తెగల్లో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని జంటలు వివాహాలు చేసుకోకుండానే కలిసి జీవిస్తాయి. ఆ తర్వాత డబ్బు సంపాదించుకుంటే పెళ్లి చేసుకుంటారు.

Updated Date - 2023-06-26T19:14:24+05:30 IST