Share News

Viral: తలనొప్పితో హాస్పిటల్‌కు వెళ్లింది.. 30 ఏళ్లు ఏం జరిగిందో మర్చిపోయింది..

ABN , Publish Date - Dec 25 , 2023 | 12:27 PM

తలకు ఏదైనా బలంగా దెబ్బ తగలడం, గతం మర్చిపోవడం తరచుగా సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు అత్యంత అరదుగా జరుగుతుంటాయి. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ తలనొప్పితో హస్పిటల్‌లో జాయిన్ అయి గతం మర్చిపోయింది. ఏకంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది.

Viral: తలనొప్పితో హాస్పిటల్‌కు వెళ్లింది.. 30 ఏళ్లు ఏం జరిగిందో మర్చిపోయింది..

తలకు ఏదైనా బలంగా దెబ్బ తగలడం, గతం మర్చిపోవడం తరచుగా సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు అత్యంత అరదుగా జరుగుతుంటాయి. అయితే అమెరికాకు (America) చెందిన ఓ మహిళ తలనొప్పితో (Headache) హస్పిటల్‌లో జాయిన్ అయి గతం మర్చిపోయింది. ఏకంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ మహిళ వయసు 60 దాటింది. అయినా ఆమె తన గతం గుర్తు తెచ్చుకోలేకపోతోంది. ఆమె ఇప్పటికీ తన టీనేజ్‌లోనే ఉండిపోయింది (Memory Loss).

అమెరికాలోని లూసియానాకు చెందిన కిమ్ డెనికోలా అనే మహిళ 2018లో తన ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తలనొప్పి రావడంతో పాటు చూపు మసకబారినట్టు అనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కళ్లు తెరిచిన తర్వాత ఆమె వింతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఏకంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. తనకు పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలున్నారనే విషయం మర్చిపోయింది. కేవలం తనకు స్కూల్, కాలేజీ రోజులు మాత్రమే గుర్తుకొస్తున్నాయని చెబుతోంది.

డెనికోలాకు పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియాకు గురైనట్టు తేల్చారు. ఆమెకు భవిష్యత్తులో కూడా గత జ్ఞాపకాలు గుర్తుకు రావడం కష్టమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం డెనికోలా తన పిల్లలు, మనవళ్లతో కలిసి ఉంటున్నారు. అధిక ఒత్తిడి, మైగ్రేన్ వంటి కారణాల వల్ల ఈ స్థితి తలెత్తుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Updated Date - Dec 25 , 2023 | 12:27 PM