Viral News: ఎవరీ అమ్మాయి..? 12 ఏళ్లకే రూ.410 కోట్లకు ఓనర్.. ఇంట్లో కూర్చునే ప్రతీ నెలా లక్షలు సంపాదిస్తోందిగా..!
ABN, First Publish Date - 2023-07-04T16:15:23+05:30
రెండు పదులు దాటితే తప్ప 'ల'కారం టచ్ చేయలేరెవ్వరు. ఎంత పెద్ద యూనివర్సిటీలలో చదివినా, ఎంత మంచి ర్యాంకుతో పాసవుట్ అయినా ఏడాదికి కోటి ప్యాకేజీ పొందడం గగనమే.. కానీ 12ఏళ్ళ ఈ పాప మాత్రం..
ఒకటి రెండు కాదు ఏకంగా 410కోట్లు. అది కూడా కేవలం 12ఏళ్ళ వయసుకే. వింటుంటేనే కళ్ళు బైర్లు కమ్ముతాయి కానీ ఇది అక్షరాలా నిజం. ఇంత డబ్బు ఈ బుడ్డిది లక్షణంగా ఇంట్లో కూర్చునే సంపాదించింది. రెండు పదులు దాటితే తప్ప 'ల'కారం టచ్ చేయలేరెవ్వరు. ఎంత పెద్ద యూనివర్సిటీలలో చదివినా, ఎంత మంచి ర్యాంకు తెచ్చుకుని పాసవుట్ అయినా ఏడాదికి కోటి ప్యాకేజీ పొందడం గగనమే.. కానీ 12ఏళ్ళ ఈ పాప ప్రతి నెలా లక్షలు సంపాదిస్తోంది. ఇప్పుడు యావత్ ప్రపంచానికే ఆసక్తిగా మారింది. ఇంతకూ ఈ పాప 410కోట్లకు అధిపతిగా ఎలా మారింది? ఈ పాప కథేంటి పూర్తీగా తెలుసుకుంటే..
డబ్బు సంపాదించడం(money earning) చాలా కష్టం అని అందరూ అనుకుంటారు కానీ కొంతమంది డబ్బు సులభంగా సంపాదిస్తారు. యూట్యూబ్(you tube), వెబ్సైట్(website), కంటెంట్ క్రియేషన్(content creation) ఇవన్నీ ఇప్పటికాలంలో చాలా ఈజీగా డబ్బు తెచ్చిపెడతాయి. కాస్త అవగాహన, మరికాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) కు చెందిన 12ఏళ్ళ అమ్మాయి(12years old girl) షఫా ఈ విధంగానే ఇప్పుడు 410కోట్లకు ఓనర్ గా మారింది. shfa తన యూట్యూబ్ ఛానల్(youtube channel) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. 2011, డిసెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో షఫా పుట్టింది. షఫాకు 4ఏళ్ళ వయసులో వాళ్ళ అమ్మ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసింది(mother creat youtube channel). షఫా రోజువారి లైఫ్ స్ఠైల్ ను యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటారు. ఇవన్నీ అరబిక్ లో ఉంటాయి. గత 8ఏళ్ళ నుండి ఇప్పటికి 984వీడియోలు అప్లోడ్ చేశారు.
Viral: ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా వచ్చిందిగా.. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన కవర్ను ఓపెన్ చేసి చూస్తే..!
చిన్నపిల్లలు షఫా లైఫ్ స్టైల్ ను చాలా ఇష్టపడుతున్నారట. ఎంతో ఇష్టంగా ఈ పాపను యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారు. షఫాకు యూట్యూబ్ లో ప్రతి 1000వ్యూస్ కు 100రూపాయల ఇన్కమ్ ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది మే నెలలో మాత్రమే షఫాకు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాలా 1.62కోట్లు. కొన్ని నెలల్లో 2.45కోట్ల దాకా ఈ పాపకు యూట్యూబ్ ఆదాయం వచ్చింది. గత వారం రోజుల్లో 63.46లక్షల ఆదాయం వచ్చింది. గత మూడు నెలల్లో ఈ పాపకు యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం 5.54కేట్లు. ఇలా ఈ పాపకు ఇప్పటివరకు వచ్చిన యూట్యూబ్ ఆదాయం 410కోట్లు. ఈ మొత్తం గురించి తెలిసి ప్రపంచమంతా నివ్వెరపోతోంది. ఈ పాప ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోంది.
Viral News: ఎన్నో ఏళ్లుగా దాచిన నిజం.. పొరపాటున అసలు జీతమెంతో తల్లికి చెప్పిన కొడుకు.. ఆ తర్వాత అతడి పరిస్థితి ఏంటంటే..!
Updated Date - 2023-07-04T16:15:23+05:30 IST