Viral Video: కోట్ల ఆస్తి ఉన్నా పిల్లికి బిచ్చం పెట్టని వారున్న ఈ రోజుల్లో.. ఈ మూగజీవాలే నయం.. ఈ గుర్రం చేసిన పనేంటో చూస్తే..

ABN , First Publish Date - 2023-03-23T14:28:50+05:30 IST

కోట్లున్నా ఇవ్వడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్ళు ఈ గుర్రాన్ని చూస్తే..

Viral Video: కోట్ల ఆస్తి ఉన్నా పిల్లికి బిచ్చం పెట్టని వారున్న ఈ రోజుల్లో.. ఈ మూగజీవాలే నయం.. ఈ గుర్రం చేసిన పనేంటో చూస్తే..

కొంతమంది ఇతరులకు ఏదైనా ఇవ్వాలన్నా, సహాయం చెయ్యాలన్నా ఎన్నెన్నో సాకులు చెబుతారు. కానీ ఇచ్చే గుణం మనసులో ఉంటే చాలని మనుషుల నుండి జంతువుల వరకు ఎన్నో సంఘటనల ద్వారా నిరూపితమవుతుంది. అలాంటిదే ఇది కూడా.. కోట్లున్నా ఇవ్వడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్ళు ఈ గుర్రాన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఇంతకూ ఈ గుర్రం చేసిన పనేంటి? అందరూ దీన్ని అంతగా ఎందుకు పొగుడుతున్నారు తెలుసుకుంటే..

అన్నం తింటున్నప్పుడు కంచంలో ఇతరులు చెయ్యి పెడితే వెంటనే కోప్పడతారు కొందరు. 'కాళ్ళూ చేతులు లేవా? తెచ్చుకుని తినలేవా?' అని తిట్టేస్తారు కూడా. అదే సందర్భంలో అన్నం పెట్టమంటూ అడుక్కునేవారు బయట అరిస్తే 'వీళ్ళొకరు తినే సమయానికి సరిగ్గా వస్తారు' అని చీదరించుకుంటూ వాళ్ళకు చివాట్లు పెడతారు మరికొందరు. ఇలా ఇతరులకు పంచడం అనే విషయంలో చాలా కఠినంగా తయారవుతున్నారు మనుషులు. కానీ ఈ గుర్రం(Horse) మనసు మాత్రం చాలా పెద్దది. గుర్రం తనుకు పెట్టిన దాణా(Horse Food) తింటున్నప్పుడు పావురాల గుంపు(Flock of Pigens) ఆ గుర్రానికి దగ్గరగా వచ్చింది. బెదురుతూనే దాణా ఉన్న బకెట్ చుట్టూ పడిన గింజలను తింటున్నాయి. సాధారణంగా అయితే జంతువులు తాము తింటున్న ఆహారం దగ్గరకు వేరే జంతువులు, పక్షులు వస్తే గుర్రుమని శబ్థం చేసి వాటిని వెళ్ళగొడతాయి. కానీ ఈ గుర్రం మాత్రం అలా చేయలేదు. పావురాలు వచ్చి తింటున్నప్పుడు కింద పడిపోయిన గింజలు వాటికి సరిపోతాయో లేదోనని తన నోటిని దాణా ఉన్న బకెట్ లో నుండి బయటకు తీసి పావురాలు ఉన్నచోట గింజలను విదిలిస్తూ తింటోంది. పావురాలు కూడా బెదిరిపోవడం ఆపి హాయిగా గింజలను తింటున్నాయి. గుర్రం తాను తినడమే కాక ఆ పావురాలకు కూడా తన ఆహారాన్ని పంచుతున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

The Figen అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్(Twitter) లో షేర్ చేశారు. 'మనుషులకంటే నోరులేని ఈ జంతువులు నయం, వీటి మధ్య మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది' అని ఒకరు, 'ఈ గుర్రాన్ని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఇలా పంచుకుని తినడంలో గొప్పదనం ఉంటుంది. దురదృష్టం కొద్ది మనుషుల్లో ఇలాంటి గుణం తగ్గిపోయింది' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Updated Date - 2023-03-23T14:28:50+05:30 IST