Baba Balaknath: అసలు ఎవరీ బాబా బాలక్‌నాథ్..? సీఎం రేసులో ఉన్న ఈయనకు ఎంత ఆస్తి ఉందంటే..!
ABN, First Publish Date - 2023-12-04T16:17:30+05:30
సీఎం పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బాబా బాలక్ నాథ్! ఈయన ఎవరంటే..
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లో(Rajasthan) బీజేపీ అద్భుత విజయం తరువాత సీఎం పీఠాన్ని అధిష్టించేది ఎవరన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బాబా బాలక్ నాథ్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వంటి సన్యాసుల పరంపరకు చెందిన బాబా బాలక్ నాథ్..ఆయనలాగే రాజస్థాన్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిజారా నియోజకవర్గం నుంచి గెలుపొందిన బాబా బాలక్ నాథ్ వయసు కేవలం 39 ఏళ్లే! మరి బాబా బాలక్ నాథ్(Baba Balaknath) బ్యాక్‌గ్రౌండ్, ఆస్తిపాస్తులు, ఆయన సన్యాసాశ్రమాన్ని ఎప్పుడు స్వీకరించారనే విషయాలను ఓమారు తెలుసుకుందాం పదండి..
అల్వర్ జిల్లా కొహ్రానా గ్రామంలో 1984 ఏప్రిల్ 16న బాబా బాలక్ నాథ్ జన్మించారు. బాల్యం నుంచే ఆయనకు సాధువులు, సన్యాసుల సేవలో జీవితాన్ని తరింపచేసుకోవాలని ఉండేది. కేవలం 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన ఆధ్యాత్మికతవైపు మళ్లారు. చిన్న వయసులోనే మహంత్ చాంద్‌నాథ్ వెంట హనుమాన్‌గఢ్ మఠకు వెళ్లిన ఆయన అక్కడే శిక్షాదీక్ష తీసుకున్నారు.
ప్రస్తుతం బాబా బాలక్ నాథ్..రోహ్‌తక్ జిల్లాలోని మస్తనాథ్ మఠానికి మహంత్‌గా వ్యవహరిస్తున్నారు. 2016లో ఆయన మఠానికి ఉత్తరాధికారిగా మారారు. ఇంటర్మీడియన్ వరకూ చదివిన ఆయన ప్రస్తుతం మస్త్‌నాథ్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా ఉన్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో గెహ్లాట్ తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా బాబా బాలక్ నాథ్ నిలిచారు.
బాబా బాలక్ నాథ్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, తనకు ఎంపీగా వచ్చే శాలరీని ఆయన స్టేట్ బ్యాంక్ ఇండియా బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ జమైన మొత్తం రూ. 13,29,558.ఆయన పేరిట తిజారా ఎస్బీఐ అకౌంట్‌లో మరో 5 వేల రూపాయలు కూడా ఉంది.
Updated Date - 2023-12-04T16:17:35+05:30 IST