పాక్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటన
ABN , First Publish Date - 2023-07-20T18:47:44+05:30 IST
పాకిస్థాన్ ఉమెన్స్ జట్టు స్టార్ క్రికెటర్ అయేషా నసీమ్(Ayesha Naseem) సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల అతి చిన్న వయసులోనే (18-year-old Pakistan cricketer Ayesha Naseem) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇస్లాం(Islam) మతానికి అనుగుణంగా పవిత్రమైన జీవితాన్ని గడపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయేషా వెల్లడించింది.
పాకిస్థాన్ ఉమెన్స్ జట్టు స్టార్ క్రికెటర్ అయేషా నసీమ్(Ayesha Naseem) సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల అతి చిన్న వయసులోనే (18-year-old Pakistan cricketer Ayesha Naseem) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇస్లాం(Islam) మతానికి అనుగుణంగా పవిత్రమైన జీవితాన్ని గడపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయేషా వెల్లడించింది. తన రిటైర్మెంట్ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అధికారికంగా తెలియచేసింది. "నేను క్రికెట్‌ను వదిలి ఇస్లాం ప్రకారం నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను" అని పీసీబీకి తెలిపింది. 7 ఆగష్టు 2004న జన్మించిన అయేషా నసీమ్ 2020లో అంటే 15 ఏళ్ల అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. పాకిస్థాన్ తరఫున 30 టీ20 మ్యాచ్‌లు, 4 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి హిట్టరైనా నసీమ్ టీ20ల్లో 369 పరుగులు చేయగా.. వన్డేల్లో 33 పరుగులు చేసింది. గత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టుపై నసీమ్ 45 పరుగులతో రాణించింది. నసీమ్ కెరీర్లో అత్యుత్తమ స్కోర్ ఇదే. ఇక నసీమ్ తన చివరి మ్యాచ్‌ను గత ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో ఆడింది.
అయితే భవిష్యత్‌లో స్టార్ బ్యాటర్‌గా రాణిస్తుందనుకున్న నసీమ్.. అందరినీ షాక్‌కు గురి చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించడం పాకిస్థాన్ అభిమానులకు మింగుడుపడడంలేదు. కాగా సాధారణంగా క్రీడాకారులు 35 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆడుతుంటారు. శరీరం సహకరించి మంచి ఫామ్‌లో ఉంటే మరికొంతకాలం కూడా ఆడతారు. ఈ లెక్కన నసీమ్‌కు సునాయసంగా మరో 17 ఏళ్ల కెరీర్ ఉంది. కానీ 18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అతి చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్ అయేషా నసీమే కావడం గమనార్హం.