పర్యవేక్షణ కమిటీలో బబిత ఫొగట్
ABN , First Publish Date - 2023-02-01T02:55:17+05:30 IST
మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో కొత్త అప్డేట్ ఇది.
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో కొత్త అప్డేట్ ఇది. ఈ అంశంపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీలో ఇప్పుడు కొత్తగా కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత, రెజ్లర్ బబిత ఫొగట్ చేర్చినట్టు కేంద్ర క్రీడాశాఖ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే మేరీకోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో బబిత ఆరో సభ్యురాలు.