World cup: ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా.. వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలి జట్టుగా..
ABN , First Publish Date - 2023-10-28T11:24:14+05:30 IST
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. శనివారం న్యూజిలాండ్‌తో ఆడిన ఈ మ్యాచ్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకు 100వది కావడం విశేషం.
ధర్మశాల: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. శనివారం న్యూజిలాండ్‌తో ఆడిన ఈ మ్యాచ్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకు 100వది కావడం విశేషం. దీంతో 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మొదటి జట్టుగా ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా ఏకంగా 72 మ్యాచ్‌ల్లో గెలిచింది. 25 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఆ జట్టు విజయాల శాతం 70కిపైగా ఉండడం విశేషం.
1975లో జరిగిన మొదటి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌లు ఆడింది. ఆ ఎడిషన్‌లో కంగారులు ఫైనల్ కూడా చేరారు. కానీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడి రన్నరఫ్‌తో సరిపెట్టుకున్నారు. 1979 ప్రపంచకప్‌లో 3 మ్యాచ్‌లు, 1983లో 6 మ్యాచ్‌లు ఆడింది. 1987లో 8 మ్యాచ్‌లు, 1992లో 8 మ్యాచ్‌లు, 1996లో 8 మ్యాచ్‌లు, 1999లో 10 మ్యాచ్‌లు, 2003, 2007 ప్రపంచకప్‌లలో కలిపి 22 మ్యాచ్‌లు ఆడింది. 2011లో 7 మ్యాచ్‌లు ఆడింది. ఇక 2015లో 9 మ్యాచ్‌లు, 2019లో 10 మ్యాచ్‌లు ఆడింది. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. ఇలా మొత్తం 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో న్యూజిలాండ్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ 94 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 89 మ్యాచ్‌లు ఆడింది. కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా ఐదు సార్లు వరల్డ్ కప్ కూడా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో వన్డే ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా నిలిచింది. ఆ జట్టు 1987, 1999, 2003, 2007, 2015లో ప్రపంచకప్ ట్రోఫిలను అందుకుంది.