Share News

Australia: ఆస్ట్రేలియా టీమ్‌కు షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

ABN , First Publish Date - 2023-11-09T16:33:33+05:30 IST

Meg Lanning: మహిళా క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు లెక్కలేనన్ని విజయాలు అందించిన ఏకైక కెప్టెన్ మెగ్ లానింగ్. అయితే ఆమె ప్రస్తుతం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Australia: ఆస్ట్రేలియా టీమ్‌కు షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

క్రికెట్‌లో ఆస్ట్రేలియా టీమ్ అంటే చాలు ఏకఛత్రాధిపత్యం అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పురుషుల టీమ్‌తో పోలిస్తే మహిళల టీమ్ ఇప్పుడు దూకుడుగా విజయాలు సాధిస్తోంది. ఆస్ట్రేలియా మహిళల టీమ్ ఏకంగా ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. ఈ ట్రోఫీలన్నీ స్టార్ ప్లేయర్ మెక్ లానింగ్ నాయకత్వంలోనే వచ్చాయి. అయితే ఆమె ప్రస్తుతం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మెక్ లానింగ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 241 మ్యాచ్‌లు ఆడింది. ఆరు టెస్టులు, 103 వన్డేలు, 132 టీ20లు ఆడింది. టెస్టుల్లో రెండు హాఫ్ సెంచరీలతో 345 పరుగులు, వన్డేల్లో 15 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో 4,602 పరుగులు, టీ20ల్లో రెండు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో 3,405 పరుగులు చేసింది.

మార్చి 25, 1992లో సింగపూర్‌లో జన్మంచిన మెగ్ లానింగ్ కుడిచేతి వాటం బ్యాటర్. జట్టుకు అవసరమైన సమయాల్లో రైటార్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేస్తుంది. 2010లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి మెగ్ లానింగ్ అరంగేట్రం చేసింది. 2014లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంపికైంది. తన కెప్టెన్సీలో 80 శాతానికి పైగా విజయాలు సాధించింది. 2014, 2018, 2020, 2023లో టీ20 ప్రపంచకప్‌లను అందించింది. ఈ సందర్భంగా తన 13 ఏళ్ల క్రీడా కెరీర్‌లో తనకు మద్దతు తెలిపిన కుటుంబం, ఆస్ట్రేలియా టీమ్ మేట్స్, క్రికెట్ ఆస్ట్రేలియా, తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది. పదమూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ గడిపినందుకు నిజంగా తాను అదృష్టవంతురాలిగా భావిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని.. కానీ తనకు ఇదే తగిన సమయం అని మెగ్ లానింగ్ వెల్లడించింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-09T16:44:37+05:30 IST