IND Vs AUS: టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ఇదే..!!
ABN , First Publish Date - 2023-10-28T21:16:08+05:30 IST
ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కోసం తమ జట్టును ప్రకటించింది.
వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా టీమిండియా బిజీబిజీగా గడపనుంది. నవంబర్ 19న ప్రపంచకప్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్‌కు ముందు వన్డే సిరీస్ ఆడిన భారత్.. తర్వాత టీ20 సిరీస్‌లో తలపడనుంది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్‌లో ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కోసం తమ జట్టును ప్రకటించింది. మొత్తం 14 మంది సభ్యులు ఉండే టీమ్ నుంచి కొందరు సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ చేతికి సారథ్య బాధ్యతలను అప్పగించింది.
టీ20 స్పెషలిస్ట్‌గా వేడ్‌కు మంచి పేరుంది. దీంతో కీలకమైన ఈ సిరీస్ కోసం అతడికి జట్టు పగ్గాలను క్రికెట్ ఆస్ట్రేలియా అప్పగించింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. నవంబర్ 23న తొలి టీ20 విశాఖలో, 26న రెండో టీ20 తిరువనంతపురంలో, 28న మూడో టీ20 గౌహతిలో, డిసెంబర్ 1న నాలుగో టీ20 నాగపూర్‌లో, డిసెంబర్ 3న ఐదో టీ20 హైదరాబాద్‌లో జరుగుతాయి.
ఐదు టీ20ల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే: మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.