ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AUS Vs NZ: నరాలు తెగే ఉత్కంఠ పోరు.. పోరాడి ఓడిన న్యూజిలాండ్‌

ABN, First Publish Date - 2023-10-28T18:44:22+05:30

ధర్మశాల వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి బాల్ వరకు పోరాడింది. కానీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియా గెలుపు సాధించింది.

వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు క్రికెట్ అభిమానులు ఉత్కంఠభరిత మ్యాచ్‌ను వీక్షించారు. శుక్రవారం బెంగళూరు వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ చివరి బాల్ వరకు ఆసక్తి రేపగా.. శనివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ కూడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి బాల్ వరకు పోరాడింది. కానీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టాల్సిన పరిస్థితిలో కొత్త బ్యాటర్ ఫెర్గుసన్ డాట్ బాల్ ఆడటంతో న్యూజిలాండ్‌కు ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గత మ్యాచ్‌లో టీమిండియాపై ఓడిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓడి పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో మూడో స్థానంలోనే కొనసాగుతోంది.

మరోవైపు ప్రపంచకప్‌ హిస్టరీలో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 388 పరుగులు చేసినప్పుడు ఆస్ట్రేలియాదే గెలుపు అని అందరూ భావించారు. కానీ న్యూజిలాండ్ అనూహ్యంగా పోరాడింది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివర్లో వరుస వికెట్లు కోల్పోవడం న్యూజిలాండ్‌కు మైనస్‌గా మారింది. ప్రధాన బ్యాటర్ జిమ్మీ నీషమ్ (58) తన దగ్గర స్ట్రయిక్ ఉంచుకోకుండా బౌల్ట్‌కు స్ట్రయికింగ్ ఇవ్వడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు మొగ్గింది. ఈ మెగా టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర సెంచరీ (116) చేసినా కీలక సమయంలో అవుట్ అయ్యాడు. డారిల్ మిచెల్ (54) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జంపాకు మూడు వికెట్లు దక్కగా.. హేజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృ‌ష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.

Updated Date - 2023-10-28T18:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising