Ashes Series: ఆస్ట్రేలియాను తిట్టడానికి విమానాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి.. ఏం చేశాడంటే?
ABN , First Publish Date - 2023-07-10T16:26:00+05:30 IST
రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో అవుట్ పెద్ద దుమారం రేపింది. ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించి గెలిచిందని ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెట్ అభిమానులు విమర్శలు చేశారు. దీంతో మూడో టెస్టు జరిగిన లీడ్స్ మైదానంలో ఇంగ్లండ్ అభిమానులు ఆస్ట్రేలియా జట్టును హేళన చేశారు. ఓ అభిమాని అయితే ఏకంగా ఆస్ట్రేలియాను తిట్టడానికి విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు.
ప్రస్తుతం యాషెస్ సిరీస్ (Ashes Series) రసవత్తరంగా సాగుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులను ఆస్ట్రేలియా (Australia) గెలవగా తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో ఇంగ్లండ్ (England) విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ కీలక హాఫ్ సెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో (Bairstow) అవుట్ పెద్ద దుమారం రేపింది. ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించి గెలిచిందని ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెట్ అభిమానులు విమర్శలు చేశారు. దీంతో మూడో టెస్టు జరిగిన లీడ్స్ మైదానంలో ఇంగ్లండ్ అభిమానులు ఆస్ట్రేలియా జట్టును హేళన చేశారు. ఓ అభిమాని అయితే ఏకంగా ఆస్ట్రేలియాను తిట్టడానికి విమానాన్ని (Flight) అద్దెకు తీసుకున్నాడు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.
స్థానిక పనిచేసే పబ్ యజమాని ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మూడో టెస్టును చూసేందుకు మైదానానికి వెళ్లాడు. అక్కడితో ఆగకుండా చిన్న విమానాన్ని అద్దె్కు తీసుకుని దానికి ఓ బ్యానర్ తగిలించాడు. సదరు బ్యానర్‌పై ‘సేమ్ ఓల్డ్ ఆసీస్ - టేలర్స్ స్పోర్ట్స్ బార్’ అని రాయించాడు. మూడో టెస్టు జరుగుతుండగా ఈ బ్యానర్ కలిగిన విమానం లీడ్స్ మైదానం మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశాడు. దీంతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అందరూ ఈ విమానాన్ని వీక్షించారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా తిట్టడానికి అభిమాని ఇంత ఖర్చు పెట్టాడా అని పలువురు చర్చించుకుంటున్నారు. తరాలు మారినా అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరు మారదంటూ ఇంగ్లండ్ అభిమానులు హేళన చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కెనడా ఓపెన్ విజేత లక్ష్యసేన్.. ఉత్కంఠ పోరులో చైనాపై గెలుపు
కాగా హెడింగ్లీలో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేయగా ఇంగ్లండ్ 237 పరుగులు మాత్రమే చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు ఆస్ట్రేలియాను 224 పరుగులకే పరిమితం చేశారు. దీంతో ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 7 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో గెలవడంతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మార్క్ వుడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.