AUS Vs NZ: ఒకే మ్యాచ్‌లో అటు భారీ సిక్సర్.. ఇటు అత్యధిక సిక్సర్లు.. ఆసీస్ ధమాకా
ABN, First Publish Date - 2023-10-28T16:27:24+05:30
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురుస్తోంది. ఈ ప్రపంచకప్‌లో భారీ సిక్సర్ ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్ అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో స్కోరు జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. ఈ ప్రపంచకప్‌లో భారీ సిక్సర్ ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్ అందుకున్నాడు. మ్యాక్స్‌వెల్ కొట్టిన సిక్స్ 104 మీటర్లు ప్రయాణించి స్టేడియం రూఫ్‌పై పడింది. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కొట్టిన సిక్సర్ (101 మీటర్లు) అత్యంత దూరంలో ప్రయాణించింది. పాకిస్థాన్‌పై వార్నర్ (98 మీటర్లు), టీమిండియాపై డారిల్ మిచెల్ (98 మీటర్లు), నెదర్లాండ్స్‌పై డేవిడ్ మిల్లర్ (95 మీటర్లు) కొట్టిన సిక్సులు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇది కూడా చదవండి: IND vs ENG: సిరాజ్ లేదా అశ్విన్.. ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!..
మరోవైపు సిక్సర్లు బాదడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు అదరగొడుతున్నారు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 61 సిక్సర్లు నమోదు చేసింది. తొలి మూడు మ్యాచ్‌లలో ఏడు సిక్సర్లు మాత్రమే కొట్టిన ఆసీస్ ఆటగాళ్లు తర్వాతి మూడు మ్యాచ్‌లలో మాత్రం ఏకంగా 54 సిక్సర్లు బాదారు. దీంతో ఆస్ట్రేలియా ధాటికి ప్రత్యర్థి జట్లు హడలిపోతున్నాయి. అటు వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు మొత్తం 20 సిక్సర్లు కొట్టింది. వన్డేల్లో ముఖ్యంగా ప్రపంచకప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు సిక్సర్ల పరంగా ఇదే అత్యధికం. గతంలో భారత్, పాకిస్థాన్ వంటి జట్లపై ఆస్ట్రేలియా 19 సిక్సర్లు బాదింది. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఆ జట్టు 25 సిక్సర్లు కొట్టింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్‌పై ఇంగ్లండ్ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక్కడే 17 సిక్సర్లు బాదాడు.
Updated Date - 2023-10-28T16:33:35+05:30 IST