ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World's Richest T20 League: బాబ్బాబు.. మా దగ్గర కూడా అలాంటిదే ఒకటి పెట్టరూ!.. ఐపీఎల్ యజమానులకు సౌదీ అరేబియా ఆఫర్.. అదే జరిగితే ఐపీఎల్ పరిస్థితేంటో?

ABN, First Publish Date - 2023-04-14T15:47:24+05:30

ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక వైబ్రేషన్. ప్రపంచ వ్యాప్తంగా బోల్డన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక వైబ్రేషన్. ప్రపంచ వ్యాప్తంగా బోల్డన్ని క్రికెట్ లీగ్‌ (Cricket League)లు ఉన్నప్పటికీ ఐపీఎల్‌(IPL)కు ఉన్న క్రేజే వారు. ప్రపంచంలోని ఏ మూలన ఉన్న క్రికెటర్ అయినా ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలనుకుంటాడు. అత్యంత లాభదాయకమైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్‌గా అవతరించింది. ఇప్పుడు ఇలాంటి టీ20 లీగ్‌నే తమ దేశంలోనూ ప్రారంభించాలని యోచిస్తున్న సౌదీ అరేబియా.. ఆ పని చేసి పెట్టాలంటూ ఐపీఎల్ యజమానుల వెంట పడుతోంది. తమ దేశంలో ‘ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్’ను ఏర్పాటు చేయాలని వారిని కోరుతున్నట్టు తెలుస్తోంది.

ఇండియన్ ప్లేయర్లు విదేశీ లీగుల్లో ఆడకుండా బీసీసీఐ నిషేధించింది. అయితే, సౌదీ అరేబియా తాజా ప్రతిపాదన నేపథ్యంలో బోర్డు తన విధానాన్ని మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ దేశంలో టీ20 లీగ్ ఏర్పాటు చేయాలన్న విషయమై ఏడాది కాలంగా ఐపీఎల్ యజమానులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, ఏం జరగాలన్నా ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అనుమతి కావాల్సి ఉంటుంది. టీ20 లీగ్ విషయంలో సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్న విషయాన్ని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బర్కిలీ కూడా నిర్ధారించారు.

సౌదీ అరేబియా ఇప్పటికే ఫార్ములా-1, ఫుట్‌బాల్ వంటి వాటిపై భారీ ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు దాని దృష్టి క్రికెట్‌పై పడింది. సౌదీలో నివసిస్తున్న స్థానికులు, ప్రవాసులకు సుస్థిర పరిశ్రమను సృష్టించడం, సౌదీని ప్రపంచ క్రికెట్ గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ చైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషల్ అల్-సౌద్ గతంలో పేర్కొన్నారు.

సౌదీ అరేబియా ప్రభుత్వం, వ్యాపార ప్రతినిధులు చాలామంది భారత క్రికెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ఐపీఎల్ యజమానులను, బీసీసీఐని తాము ప్లాన్ చేసిన టీ20 లీగ్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఆర్థికంగా బలమైన దేశమైన సౌదీ కనుక టీ20 క్రికెట్ లీగ్‌ను ప్రారంభిస్తే ఆర్థికంగా ఐపీఎల్‌కు గట్టి పోటీ తప్పదన్న భావన ఉంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ లేదంటే కనీసం ఐపీఎల్ ఒక రౌండ్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించే యోచనలో కూడా సౌదీ అరేబియా ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2023-04-14T15:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising