Virat Kohli: కెరీర్‌లో ఇలా ఆడటం కోహ్లీకి ఇదే తొలిసారి..!!
ABN , First Publish Date - 2023-07-21T17:56:52+05:30 IST
ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. కోహ్లీ ఫామ్ పక్కనపెడితే ఈ టెస్టులో అతడు తొలి పరుగు తీయడానికి చాలా కష్టపడ్డాడు. దీని కోసం ఏకంగా 21 బంతులు తీసుకున్నాడు. తొలి 20 బంతుల్లో పరుగులేమీ చేయని అతడు 21వ బంతికి ఖాతా తెరిచాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది ఓ రికార్డుగా నిలిచిపోయింది.
టీమిండియా (Team India) రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్(IPL)లో నిలకడగా రాణించిన కోహ్లీ డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 14, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ (West Indies) సిరీస్‌లో పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో 76 పరుగులు చేసిన కోహ్లీ రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 161 బాల్స్‌లో 87 రన్స్‌తో అజేయంగా క్రీజులో ఉన్నాడు. కోహ్లీ ఫామ్ పక్కనపెడితే ఈ టెస్టులో అతడు తొలి పరుగు తీయడానికి చాలా కష్టపడ్డాడు. దీని కోసం ఏకంగా 21 బంతులు తీసుకున్నాడు. తొలి 20 బంతుల్లో పరుగులేమీ చేయని అతడు 21వ బంతికి ఖాతా తెరిచాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది ఓ రికార్డు(Record)గా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: Shubman Gill: గిల్ ప్రతాపం ఇక్కడేనా? అతడి పనైపోయిందా?
గతంలో టెస్ట్ కెరీర్‌లో కోహ్లీ ఇంత నిదానంగా ఆడిన దాఖలాలు లేవు. కెరీర్ ప్రారంభంలో 2011లో వెస్టిండీస్‌తో బార్బడోస్ వేదికగా జరిగిన టెస్టులో ఖాతా తెరిచేందుకు కోహ్లీ తీసుకున్న బంతులే ఇప్పటివరకు అత్యధికంగా కొనసాగుతూ వచ్చాయి. ఆ టెస్టులో కోహ్లీ తొలి పరుగు చేసేందుకు 19 బాల్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి ఖాతా తెరిచేందుకు 21 బాల్స్ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత వేగంగా ఆడేందుకు విరాట్ ప్రయత్నించాడు. కవర్ డ్రైవ్‌లు, స్ట్రెయిట్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఆట ముగిసే సమయానికి 161 బాల్స్‌లో 8 ఫోర్ల సహాయంతో 87 పరుగులు చేశాడు. కాగా కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 500వ మ్యాచ్. ఇప్పటివరకు కోహ్లీ కాకుండా 9 మంది క్రికెటర్లు అంతర్జాతీయంగా 500 మ్యాచ్‌లు ఆడగా ఒక్కరూ కూడా చారిత్రక మ్యాచ్‌లో సెంచరీ సాధించలేదు. కోహ్లీ మరో 13 పరుగులు చేస్తే ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.
ఇది కూడా చదవండి: పాక్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటన