Virat Kohli: ఒక్క సెంచరీతో కోహ్లీ ఖాతాలో చేరిన రికార్డులు ఇవే
ABN , First Publish Date - 2023-01-15T21:39:46+05:30 IST
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారీ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు
తిరువనంతపురం: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారీ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 46వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా ఇది 74వది.
ఈ ఒక్క శతకంతో కోహ్లీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై కోహ్లీకి ఇదే (166 నాటౌట్) వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు. అలాగే, స్వదేశంలో కోహ్లీకి ఇది 21వ సెంచరీ. శ్రీలంకపై 10 సెంచరీలు బాదిన కోహ్లీ.. ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే, అంత్యంత వేగంగా 150 పరుగులు సాధించిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. కోహ్లీ 106 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు.