Share News

World Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియా అభిమాని నోట ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-10-21T14:11:50+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఎక్కడెక్కెళ్లినా భారత్ నినాదాలు ఆగడం లేదు. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయిన సంగతి తెలిసిందే.

World Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియా అభిమాని నోట ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు.. వీడియో వైరల్

బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఎక్కడెక్కెళ్లినా భారత్ నినాదాలు ఆగడం లేదు. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. భారత్ మాతా కీ జై, జై శ్రీరాం, వందేమాతరం నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. లక్ష మందికి పైగా ఒకేసారి భారత్ మాతా కీ జై అని నినదించడం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాకుండా అది విన్న వారికి గూస్ బంప్స్ వచ్చాయి. అయితే శుక్రవారం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టును భారత్ మాతా కీ జై అని నినాదాలు వదలలేదు. ఇక్కడ విశేషం ఏంటేంటే.. ఈ సారి భారత్ మాతా కీ జై అన్నది భారతీయుడు కూడా కాదు. ఆస్ట్రేలియా అభిమాని కావడం విశేషం. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఆస్ట్రేలియా అభిమానులు తమ జట్టుకు మద్దతు తెలపడానికి స్టేడియానికి భారీగా వచ్చారు. అయితే ఆస్ట్రేలియా టోపీ, జెండా ధరించిన ఓ అభిమాని భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ‘‘మన సంస్కృతిని ప్రేమించే, గౌరవించే వారందరినీ మేము ప్రేమిస్తాము, గౌరవిస్తాము’’ అని రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఇక మ్యాచ్ ఈ విషయానికొస్తే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163), మిచెల్‌ మార్ష్‌ (108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) ఆకాశమే హద్దుగా భారీ శతకాలతో విజృంభించారు. అనంతరం స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (4/53) కీలక వికెట్లతో దెబ్బతీశాడు. దీంతో పాక్‌పై 62 పరుగుల తేడాతో నెగ్గిన ఆసీస్‌.. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఆసీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు చేసింది. షహీన్‌ అఫ్రీదికి ఐదు, రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో పాక్‌ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఇమామ్‌ (70), అబ్దుల్లా షఫీక్‌ (64), రిజ్వాన్‌ (46) మాత్రమే ఆకట్టుకున్నారు. స్టొయినిస్‌, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వార్నర్‌ నిలిచాడు.

Updated Date - 2023-10-21T14:11:50+05:30 IST