ODI World Cup: హైదరాబాద్, విశాఖకు డబుల్ ధమాకా
ABN , First Publish Date - 2023-07-26T02:40:00+05:30 IST
స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌క్‌పలో భారత్ తలపడే ఒక్క మ్యాచ్‌నికూడా కూడా తెలుగు రాష్ట్రాలకు కేటాయించలేదని బాధపడుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ఎట్టకేలకు ఊరటనిచ్చింది.
చెరో టీ20, టెస్టుకు ఆతిథ్యం
2023-24 స్వదేశీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
ఆసీస్, అఫ్ఘాన్, ఇంగ్లండ్‌తో 16 మ్యాచ్‌లు ఆడనున్న భారత్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌క్‌ప (ODI World Cup)లో భారత్ తలపడే ఒక్క మ్యాచ్‌నికూడా కూడా తెలుగు రాష్ట్రాలకు కేటాయించలేదని బాధపడుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ(BCCI) ఎట్టకేలకు ఊరటనిచ్చింది. 2023-24లో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్, ఇంగ్లండ్ జట్ల టూర్ షెడ్యూల్స్‌ను బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇందులో హైదరాబాద్, విశాఖపట్నంకు చెరో టీ20, టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించింది. మొత్తంగా ఈ మూడు జట్లతో భారత్ 16 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 3 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్టులు ఉన్నాయి. వరల్డ్‌క్‌పనకు ముందు సన్నాహకంగా వచ్చే నెల 22-27 మధ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీ్‌సలో ఆడనుంది. సరిగ్గా వరల్డ్‌కప్ ముగిసిన వారం తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీ్‌సలో భారత్ తలపడనుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరిలో అఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అఫ్ఘాన్‌తో స్వదేశంలో భారత్ ఆడుతున్న తొలి వైట్‌బాల్ సిరీస్ ఇదే. 2018లో ఈ జట్టుతో భారత్ స్వదేశంలో టెస్టు ఆడింది కానీ, పొట్టి ఫార్మాట్‌లో ఆడింది లేదు. తర్వాత జనవరి-మార్చి మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీ్‌సలో భారత్ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన మూడు వారాలకు అటు ఇటుగా ఐపీఎల్ సందడి ప్రారంభమవనుంది. ఇక, వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌క్‌పకు జట్టును పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఎక్కువ టీ20లను బీసీసీఐ షెడ్యూల్ చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు ఫ్యాన్స్‌కు పండగే
హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు వన్డే వరల్డ్‌క్‌పలో ప్రాధాన్యం దక్కని మొహాలీ, రాజ్‌కోట్, నాగపూర్, ఇండోర్, తిరువనంతపురానికి ఈ తాజా షెడ్యూల్‌లో బీసీసీఐ అగ్రతాంబూలం ఇచ్చింది. అలానే రొటేషన్ పాలసీ ప్రకారం ఈసారి అహ్మదాబాద్‌ను పక్కనపెట్టి, ఇతర నగరాలకు అవకాశాలు కల్పించారు. ఈ 16 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో హైదరాబాద్, విశాఖపట్నం, మొహాలీ, రాజ్‌కోట్, ఇండోర్‌కు రెండేసి మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడం విశేషం. ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ నవంబరు 23న విశాఖపట్నంలో ఆరంభమవనుండగా, డిసెంబరు 3న హైదరాబాద్‌లో ముగియనుంది. అలానే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ వచ్చే ఏడాది జనవరి 25న హైదరాబాద్ వేదికగా ప్రారంభమవనుంది. రెండో టెస్టు ఫిబ్రవరి రెండు నుంచి విశాఖలో జరుగుతుంది.