ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MS Dhoni: ధోనికి నంబర్ 7తో నివాళులర్పించిన గూగుల్ ఇండియా

ABN, First Publish Date - 2023-12-13T12:23:08+05:30

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి గూగుల్ ఇండియా నంబర్ 7తో నివాళులర్పించింది. 7 నంబర్‌కు గల ప్రత్యేకతను గూగుల్ ఇండియా స్పష్టంగా చెప్పింది. నంబర్ 7లో ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పుకొచ్చింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి గూగుల్ ఇండియా నంబర్ 7తో నివాళులర్పించింది. 7 నంబర్‌కు గల ప్రత్యేకతను గూగుల్ ఇండియా స్పష్టంగా చెప్పింది. నంబర్ 7లో ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు వాట్ ఇస్ ది స్పెషల్ అబోట్ నంబర్ 7(What is the Special about number 7) అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చిన సమాధానాన్ని తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అలా సెర్చ్ చేయగా గూగుల్‌లో ధోని ఫోటోలు కనిపించడాన్ని కూడా మనం గమనించవచ్చు. దానికి “సందేశం స్పష్టంగా ఉంది. దానికి కారణం తలా” అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. గూగుల్‌లో నంబర్ 7 ప్రత్యేకత గురించి శోధించగానే ధోని ఫోటోలతోపాటు, నంబర్ 7కు సంబంధించిన ఇతర ప్రత్యేకతలు కూడా వస్తున్నాయి. ఇంద్ర ధనస్సులో ఏడు రంగులుంటాయని, వారానికి ఏడు రోజులు అని, ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయని, ఏడు ప్రధాన సముద్రాలు, ఏడు ఖండాలు ఉన్నాయని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో వస్తోంది. దీనికి తోడు ధోని ధరించే జెర్సీ నంబర్ 7 కావడం గమనార్హం. దీంతో గూగుల్‌లో 7 నంబర్‌కు ప్రత్యేకత పెరిగిపోయింది. కాగా అభిమానులు ధోనిని తలా అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే. కాగా ఎక్స్‌లో గూగుల్ ఇండియా చేసిన ఈ పోస్ట్‌ను చూసిన ధోని అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 7 అనేది ఒక నంబర్ మాత్రమే కాదని, అదొక బ్రాండ్ అని కామెంట్స్ చేస్తున్నారు. గూగుల్ ఇండియా చేసిన ఈ పోస్ట్, అభిమానుల ప్రతిస్పందనలు ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - 2023-12-13T12:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising