MS Dhoni: ధోనీ దంపతుల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!
ABN , First Publish Date - 2023-11-17T09:54:07+05:30 IST
మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేక చోటు ఉంది. కెప్టెన్‌గా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడు. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక సారథి.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేక చోటు ఉంది. కెప్టెన్‌గా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడు. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక సారథి. అందుకే ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించినా అతడి చరిష్మా మాత్రం తగ్గలేదు. తిరుగులేని నాయకుడిగా ఘనత, కోట్ల ఆస్తులు, అంతకుమించి కోట్లాదిమంది అభిమానగణం. ఇన్ని సంపాదించుకున్నా సింప్లిసిటీకి చిరునామాగా నిలుస్తున్నాడు కెప్టెన్ కూల్. దీనికి అద్దం పట్టే ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.
ధోనీ తన భార్య సాక్షి సింగ్ (Sakshi Singh), కుమార్తె జీవాతో కలిసి ఉత్తరాఖండ్‌లోని తమ పూర్వీకులు నివశించిన ల్వాలి(Lwali) అనే గ్రామాన్ని బుధవారం సందర్శించాడు. సుమారు 20 ఏళ్ల తర్వాత అల్మోరా జిల్లా కేంద్రానికి వెళ్లిన ధోనీ అక్కడికి సమీపంలోని ల్వాలి గ్రామంలో ఫ్యామిలీతో కలిసి పర్యటించాడు. ఈ సందర్భంగా స్థానికులలో ఒకడిగా కలసిపోయిన ఎంఎస్‌డీ.. వారిని ఆప్యాయంగా పలకరించాడు. ఈ సందర్భంగా గ్రామంలోని వారు ధోనీతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అలా వారితో ఫొటోలు దిగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపాడు తలా. ఈ క్రమంలోనే తనను పలకరించిన ఓ పెద్దావిడా పాదాలకు నమస్కరించారు ధోనీ దంపతులు. ఇలా ల్వాలి గ్రామంలో వారు సరదాగా గడిపిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్‌గా మారాయి. దీంతో ధోనీ సింప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులు కూడా ధోనీ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. 1970 సమయంలో ధోని తండ్రి పాన్ సింగ్ లవాలీ గ్రామంలో నివసించేవారు. అనంతరం స్టీల్ మిల్లులో పనిచేసేందుకు పాన్ సింగ్ కుటుంబం రాంచీకి వలసవెళ్లింది. అయితే లవాలీ గ్రామం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. అల్మోరా జిల్లా కేంద్రానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో లవాలీ గ్రామం ఉంది. ఇప్పటికీ ధోనీ బంధువులు చాలా మంది ఈ ఊర్లో నివశిస్తున్నారు. ఇక ధోనీ కుటుంబం రాకతో లవాలీ గ్రామంలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. ఇక 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే, 2020 ఆగష్టులో మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో మాత్రమే ఆడుతున్నాడు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.