Dhoni Daughter: ధోని కుమార్తె స్కూల్, ఫీజు వివరాలు మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-12-09T09:14:18+05:30
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి(MS Dhoni) సంబంధించిన వివరాలు ఏవైనా సరే ఆసక్తికరంగా ఉంటాయి. ధోని, సాక్షి ధోనిలకు ఒక్కగానొక్క కుమార్తె జివా ధోని 2006 ఫిబ్రవరి 6న జన్మించింది. మరో రెండు నెలల్లో తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది ఈ చిన్నారి. జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీలో చదువుకుంటున్న ఆ చిన్నారి స్కూల్ విశేషాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది.
జార్ఖండ్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి(MS Dhoni) సంబంధించిన వివరాలు ఏవైనా సరే ఆసక్తికరంగా ఉంటాయి. ధోని, సాక్షి ధోనిలకు ఒక్కగానొక్క కుమార్తె జివా ధోని 2006 ఫిబ్రవరి 6న జన్మించింది. మరో రెండు నెలల్లో తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది ఈ చిన్నారి. జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీలో చదువుకుంటున్న ఆ చిన్నారి స్కూల్ విశేషాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆమె జివా టౌరియన్ వరల్డ్ స్కూల్ లో చదువుతోంది.
అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న పాఠశాలగా దీనికి పేరుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి అమిత్ బజ్లా 2008లో దీన్ని స్థాపించారు. ఆయన ప్రస్తుతం ముంబయిలో నివసిస్తున్నారు. 2008 నుంచి పాఠశాల ఛైర్మన్ గా ఉన్నారు. 65 ఎకరాల క్యాంపస్ లో ఉన్న ఈ స్కూల్ సమగ్ర విద్యా విధానాన్ని కలిగి ఉంది. సేంద్రియ వ్యవసాయం, గుర్రపు స్వారీ వంటి అనేక శిక్షణలను అందిస్తుంది.
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రత్యేక తరగతులు ఉంటాయి. అత్యున్నత విద్యనభ్యసించిన టీచర్లతో ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు చక్కటి వాతావరణాన్ని కలిగి ఉంది. స్కూల్ లో ఎల్ కేజీ నుంచి 8 వ తరగతి వరకు టర్మ్ బోర్డర్ చైల్డ్ కు వార్షిక రుసుం సుమారు రూ.4.40 లక్షలు, 9 నుంచి 12 తరగతి వరకు యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీ, క్రీడా దుస్తులతో కలిపి సుమారు రూ.4.80 లక్షలు చెల్లించాలి.
Updated Date - 2023-12-09T09:15:32+05:30 IST