Dhoni Nepal Fans: ధోని అభిమానుల మంచి మనస్సు.. నేపాల్‌లో భారీగా సేవా కార్యక్రమాలు
ABN , First Publish Date - 2023-07-08T16:10:38+05:30 IST
అనేక మంది అభిమానులు ధోని పుట్టిన రోజును పురస్కరించుకుని భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేపాల్ దేశంలో (Dhoni Nepal Fans) ఉన్న ధోని అభిమానులు మహీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారీ ఎత్తున పాల్గొన్న అభిమానులు ధోని పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ (Mahendra Singh Dhoni) శుక్రవారంనాడు 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. దీంతో అభిమానులు ధోని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే ధోనికి దేశాలతో సంబంధం లేకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. దీంతో వాళ్లు కూడా విదేశాల్లోనే తమ అభిమాన క్రికెటర్ పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. అయితే అనేక మంది అభిమానులు ధోని పుట్టిన రోజును పురస్కరించుకుని భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేపాల్ దేశంలో (Dhoni Nepal Fans) ఉన్న ధోని అభిమానులు మహీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారీ ఎత్తున పాల్గొన్న అభిమానులు ధోని పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే పేదలకు ఆహార పదార్థాలు పంచిపెట్టారు. రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది ధోని అభిమానులు రక్తదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు బ్యాగులను పంచిపెట్టారు. అలాగే అనేక వస్తువులను పంచి పెట్టారు. దీంతో ధోని అభిమానులపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ధోని మాత్రమే కాదని అతని అభిమానులు కూడా గొప్పొళ్లే అంటున్నారు. ధోని అభిమానుల మనస్సు చాలా మంచిది అని ప్రశంసిస్తున్నారు.
మరోవైపు ధోని పుట్టిన రోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 52 అడుగుల ధోని భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తున్న ఫోజ్‌తో కటౌట్‌ను తయారు చేశారు. ఈ కటౌట్‌పై తెలుగు ఎంఎస్ఆడియన్స్ అనే స్టిక్కర్ కూడా వేశారు. సాధారణంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా హిరోల కటౌట్లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో క్రికెటర్ల కటౌట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పుట్టిన రోజుల సందర్భంగా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వారి కటౌట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో కూడా ధోని భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఏకంగా 77 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఓ క్రీడాకారుడికి ఏర్పాటు చేసిన అతిపెద్ద కటౌట్‌గా ఇది నిలవనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ధోని భారీ కటౌట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.