Ashes: చావో రేవో‌.. మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టులో 3 మార్పులు

ABN , First Publish Date - 2023-07-05T17:27:56+05:30 IST

సొంత గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో(Ashes Series 2023) వెనుకబడిన ఇంగ్లండ్ (England) జట్టు ఎలాగైనా రేసులోకి రావాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే సిరీస్‌లో మొదటి రెండు టెస్టులు ఆడి వెనుకబడిన ఇంగ్లండ్ జట్టు గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టులో గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

Ashes: చావో రేవో‌.. మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టులో 3 మార్పులు

సొంత గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో(Ashes Series 2023) వెనుకబడిన ఇంగ్లండ్ (England) జట్టు ఎలాగైనా రేసులోకి రావాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే సిరీస్‌లో మొదటి రెండు టెస్టులు ఆడి వెనుకబడిన ఇంగ్లండ్ జట్టు గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టులో గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే ఇంగ్లండ్ సిరీస్ కోల్పోతుంది. దీంతో చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ముందుగానే తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. అయితే తుది జట్టులో భారీ మార్పులు చేసింది. లీడ్స్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్‌లో ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది.

మొదటి రెండు టెస్ట్‌ల్లో ఘోరంగా విఫలమైన వేటరన్ పేసర్ జిమ్మి అండర్సన్‌ను (Jimmy Anderson) తప్పించింది. అతనితోపాటు మరో పేసర్ జోష్ టంగ్, బ్యాటర్ ఓలిప్ పోప్‌కు కూడా మూడో టెస్ట్‌లో అవకాశం కల్పించలేదు. వీరి స్థానాల్లో మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీని తుది జట్టులోకి తీసుకుంది. లీడ్స్ పిచ్ ప్రధానంగా పేస్‌కు అనుకూలించనుండడంతో నలుగురు ప్రధాన పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఇంగ్లండ్ బరిలోకి దిగుతుంది. వీరికి తోడు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా పేస్ బౌలరే కావడం గమనార్హం. ఒక వేళ మూడో టెస్ట్ మ్యాచ్ కూడా ఓడితే ఇంగ్లండ్ సిరీస్ కోల్పోతుంది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లీష్ జట్టుకు చావో రేవో అన్నట్లుగా తయారైంది. కాగా ఆస్ట్రేలియా తుది జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇంగ్లండ్ తుది జట్టు మాత్రం ఇలా ఉంది.

జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్.

Updated Date - 2023-07-05T17:33:37+05:30 IST