న్యాయవాదుల విధుల బహిష్కరణ

ABN , First Publish Date - 2023-01-09T22:17:30+05:30 IST

నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కోర్టు సిబ్బందిపై కలెక్టర్‌ కార్యాలయం సిబ్బంది కేసు నమోదు చేసినందుకు నిరసనగా సోమవారం బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు విధులు బహిష్కరించారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

బెల్లంపల్లి, జనవరి 9 : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కోర్టు సిబ్బందిపై కలెక్టర్‌ కార్యాలయం సిబ్బంది కేసు నమోదు చేసినందుకు నిరసనగా సోమవారం బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు విధులు బహిష్కరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అంకం శివకుమార్‌, ప్రధాన కార్యదర్శి చేను రవికుమార్‌లు మాట్లాడుతూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కోర్టు సిబ్బందిపై తప్పుడు కేసు నమోదు చేయడం హేయమైన చర్య అన్నారు. వెంటనే కేసు వెనక్కి తీసుకుని కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

లక్షెట్టిపేట: నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సిబ్బందిపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కేసులకు నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కోర్టు ఈపీ ప్రొసీడింగ్స్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన న్యాయవాది, సిబ్బందిపై కలెక్టర్‌ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ కేసులు పెట్టడం సరికాదన్నారు. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T22:17:34+05:30 IST