Harish rao: కాంగ్రెస్ గెలిస్తే 3 గంటలే కరెంట్ ఉంటుంది
ABN, First Publish Date - 2023-11-17T17:25:54+05:30
పది మొక్కులు మొక్కినా దేవుడే ఒకటో, రెండో తీరుస్తాడు. కానీ కేసీఅర్ మాత్రం పదికి తొమ్మిది తీర్చారు
సిద్దిపేట: కేసీఅర్ (CM Kcr) గెలవగానే జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు (Harish rao Election Campaign) తెలిపారు. మర్కూక్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ (BRS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘మర్కూక్ మండలం కావడానికి కేసీఅరే కారణం. చెయ్యి గుర్తోడు, సైకిల్ గుర్తు వాడు వచ్చినా నీళ్లు ఇవ్వలేదు. తప్పి పోయి రేపు గజ్వేల్‌లో కేసీఅర్ కాకుండా వేరే వాళ్లు వస్తే కేసీఅర్ వేసిన రోడ్డులకు ప్యాచులు వేసే వారే ఉండరు. ఒకడు కులం పేరుతో వస్తున్నాడు.. ఇన్ని రోజులు ఏటు పోయారు. ఈసారి కేసీఅర్ గెలిస్తే పింఛన్ రెండు వేల రూపాయలు కాస్తా ఐదు వేలు వస్తాయి. రైతులకే తిరిగి డబ్బులు ఇచ్చిన ఘనత కేసీఅర్‌దే. మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం వస్తుంది. బీఆర్ఎస్ గెలిస్తే నాలుగు వందలకే సిలిండర్ ఇస్తాం.’’ అని తెలిపారు.
‘‘రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు భూమితో సంబంధం లేకుండా పేదలకు కూడా ఐదు లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది. పోయిన ఎన్నికల్లో బీజేపీకి ఒక సీటు వచ్చింది. ఈసారి ఒకటో రెండో వస్తాయి. కేసీఅర్‌పై బూతులు మాట్లాడే వాళ్లకు పోలింగ్ బూతులో బుద్ది చెప్పండి. కాంగ్రెస్‌కు ఓటేస్తే మూడు గంటల కరెంట్ కావాలో.. కేసీఅర్ కావాలో నిర్ణయించుకోండి. పది మొక్కులు మొక్కినా దేవుడే ఒకటో, రెండో తీరుస్తాడు. కానీ కేసీఅర్ మాత్రం పదికి తొమ్మిది తీర్చారు.’’ అని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-11-17T17:26:00+05:30 IST