Azad: మావోయిస్టు పార్టీపై తప్పుడు ప్రచారం మానుకోండి

ABN , First Publish Date - 2023-10-01T13:23:24+05:30 IST

పేరు లేని ఆకాశరామన్న ఆదివాసీ సంఘాల పేరులో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు మావోయిస్టు పార్టీ(Maoist Party)పై చేస్తున్న

Azad: మావోయిస్టు పార్టీపై తప్పుడు ప్రచారం మానుకోండి

- మావోయిస్టు నేత ఆజాద్‌ పేరిట లేఖ

చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): పేరు లేని ఆకాశరామన్న ఆదివాసీ సంఘాల పేరులో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు మావోయిస్టు పార్టీ(Maoist Party)పై చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులకు ఆయన పేరుతో లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఆదివాసీ సంఘాల క్రియేటర్స్‌, రైటర్స్‌, డైరెక్టర్స్‌, ప్రెసిడెంట్స్‌ అందరూ ఎస్‌ఐబీ పోలీసులేనని ఆరోపించారు. చర్ల మండల కేంద్రంలో వేలిసిన కరపత్రాలు వ్యూహాత్మక సూరజ్‌ కుండ్‌ పథకం దాడిలో భాగమేనని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సమస్యలైన విద్యం, వైద్యం, ఇలు, భూమి, కరెంట్‌, తాగునీరు, సాగునీటికోసం ప్రజలు పోరాటం చేయకుండా ప్రభుత్వాలు కల్పించాలన్నారు. మావోయిస్టుల మూలంగానే ఆదివాసీలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉంటున్నారని ఆదివాసీ సంఘాల ముసుగులో దుస్పచారం చేయడం పోలీసులు తమ ప్రమోషన్ల కోసమేనని ఆరోపించారు.

జిల్లాలో అన్ని ప్రభుత్వ వైద్యశాల్లో వైద్యులు, మందులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గ్రామల్లో మహిళలు కర్తహీనతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ఆదివాసీ విద్యార్దులు ఉద్యోగాలు లేక కూలీ పనులకు పోతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు పక్కన బెట్టి పోలీస్‌ క్యాంపులు, రోడ్లు వేయడం ఖనిజ సంపదను దొచి పెట్డడడం కోసమే అని ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులు ఎత్తి వేయాలని పోరాడుతున్న వారిపై వైమానిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఆదివాసీలపై దేశద్రోహం, ఉపా లాంటి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ఆదివాసీలు పడుతున్న ఇబ్బందులను ఆజాద్‌ లేఖలో పేర్కొన్నారు. పోలీసులపై పలు ఘాటైన విమర్శలు చేశారు.

maoist.jpg

Updated Date - 2023-10-01T13:23:24+05:30 IST