ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhadrachalam, BRS: రాజధానికి చేరిన భద్రాద్రి బీఆర్‌ఎస్‌ లొల్లి

ABN, First Publish Date - 2023-09-05T12:37:36+05:30

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్‌(BRS) నాయకుల మధ్య సమన్వయం లోపించి చోటు చేసుకుంటున్న లొల్లి వ్యవహారం

- గులాబీ నేతల మధ్య కొరవడిన సమన్వయం

- బుచ్చయ్యను తొందరపడొద్దన్న మంత్రి హరీష్‌రావు

- మంత్రిని కలిసిన నియోజకవర్గ నాయకులు

భద్రాచలం: భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్‌(BRS) నాయకుల మధ్య సమన్వయం లోపించి చోటు చేసుకుంటున్న లొల్లి వ్యవహారం రాజధానికి చేరింది. భద్రాచలం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ తెల్లం వెంకట్రావును సీఎం కేసీఆర్‌(CM KCR) ప్రకటించిన అనంతరం నియోజకవర్గంలో ఒక్కసారిగా అసమ్మతి సెగ రాజుకుంది. ఈ క్రమంలో పార్టీ టికెట్‌ను ఆశించిన చర్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బోదెబోయిన బుచ్చయ్య, వాజేడు, వెంకటాపురం మండల కమిటీలతో సమావేశమై తనకు సహకారం అందించాలని అభ్యర్ధించారు. రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇరువురు మంత్రుల సూచనల మేరకు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనకు పార్టీ అభ్యర్ధిగా అవకాశం లభించకపోవడంతో ఆయన ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు పార్టీ నాయకత్వం న్యాయం చేయాలంటూ ఆయన సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో చర్లలో సైతం నియోజకవర్గంలోని ఐదు మండలాల బీఆర్‌ఎస్‌ కమిటీలు సమావేశమై తొలి నుంచి నియోజకవర్గంలో పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణనను కొనసాగించాలని డిమాండ్‌ చేయడం గమనార్హం. ఈ క్రమంలో భద్రాచలంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ చేరికల సమావేశానికి సైతం భద్రాచలం భద్రాచలం మండల కమిటీ గైర్హాజరవడం చర్చకు దారి తీసింది. బీఆర్‌ఎస్‌ కార్యాలయం భద్రాచలంలో ఇప్పటికే ఉండగా మరోచోట మళ్లీ కార్యాలయం ఏర్పాటు చేయడం(మాజీ ఎంపీ పొంగులేటి వర్గంలో కొనసాగిన సమయంలో ఏర్పాటు చేసిన కార్యాలయం) సమంజసం కాదని భద్రాచలం మండల కమిటీ కీలక నాయకులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా... భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో సమన్వయ లోపంతో నాయకుల మధ్య కొనసాగుతున ్న లొల్లి వ్యవహారం రాజధానికి చేరింది. భద్రాచలం నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావును కలిసారు. ఈ సమయంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని వారు పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఆశతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి అభ్యర్థిత్వం దక్కకపోవడంతో నిరాశ చెందిన బుచ్చయ్యకు పార్టీ నాయకత్వం న్యాయం చేయాలని నియోజకవర్గ నాయకులు మంత్రి హరీష్‌రావును కోరినట్లు తెలుస్తోంది. దీంతో బుచ్చయ్యను ఏ మాత్రం తొందరపడవద్దని పార్టీ న్యాయం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ వచ్చిన అనంతరం ఈ విషయమై మాట్లాడదామని నాయకులను బుజ్జగించినట్లు వినికిడి.

ఇన్‌చార్జ్‌పై స్పష్టత కరువు

భద్రాచలం బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిపై స్పష్టత కరువైందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. వాస్తవానికి గత కొంత కాలంగా భద్రాచలం బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ తాతామధు పేరు తెరపైకి రావడం ఆయన సైతం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తనను పక్కకు పెట్టడం పట్ల మాజీ ఎమ్మెల్సీ బాలసాని మనస్తాపానికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న తన పట్ల ఈ విధంగా వ్యవహరించడంతో ఆయన కొంత ఆవేదన చెందినట్లు ఆయన అనుచరులు అంతర్గతంగా పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం భధ్రాచలంలో జరిగే పార్టీ సమావేశానికి రావాల్సిందిగా బాలసానిని ఎంపీ మాలోతు కవిత కోరినట్లు తెలిసింది. కీలక నాయకులందరూ సమావేశానికి వస్తున్న తరుణంలో రావాలని ఆయనను కోరినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికలకు కీలక సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీలో వివిధ కారణాలతో అసమ్మతి సెగ రాజుకొని రాజధాని వరకు వెళ్లడంతో రాబోయే రోజుల్లో ఇది దేనికి దారి తీస్తుందో అని ఆ పార్టీ క్యాడర్‌ ఆందోళన చెందుతోంది. సాధ్యమైనంత త్వరలో పార్టీ జిల్లా రాష్ట్ర నాయకత్వం నాయకుల మధ్య సమన్వయం చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిదఽ్ధం చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-09-05T12:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising