Bhadrachalam: భద్రాద్రి హుండీ ఆదాయం రూ.2,20,91,906
ABN, First Publish Date - 2023-02-03T12:34:26+05:30
భద్రాచలం సీతారామచంద్రస్వామి(Seetharamachandra Swamy) హుండీ ఆదాయాన్ని గురవారం లెక్కించారు. దేవస్థానంలోని చిత్రకూట మండలంలో నిర్వహించిన
భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి(Seetharamachandra Swamy) హుండీ ఆదాయాన్ని గురవారం లెక్కించారు. దేవస్థానంలోని చిత్రకూట మండలంలో నిర్వహించిన ఈ లెక్కంపులో 84రోజులకుగాను మొత్తం రూ.2 కోట్ల 20 లక్షల 91వేల 906 వచ్చింది. అలాగే 250 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, 499 యుఎస్ డాలర్లు, 55 కెనడా డాలర్లు, సింగపూర్‌కు చెందిన 85డాలర్లు, ఆస్ట్రేలియాకు చెందిన 180, న్యూజిల్యాండ్‌కు చెందిన 10డాలర్లు వచ్చాయి. ఒమన్‌కు చెందిన 200బైసా, కువైట్‌కు చెందిన దీనార్, సౌత్ ఆఫ్రికాకు చెందిన 30రూడ్స్, సౌదీ ఆరే బియాకు చెందిన 36 రియాల్స్, యూఏఈకి చెందిన 125 దీరామ్స్, యూర్‌పకు చెందిన 140 యూరోస్ వచ్చాయి. చివరిసారిగా హుండీ లెక్కింపు 2022 నవంబరు 10న నిర్వహించగా 84రోజుల అనంతరం గురువారం లెక్కించారు. కార్తీకమాసం, ముక్కోటి, సంక్రాంతి పండగలు, సెలవులు ఉన్నాయి. కాగా ఆశాజనకంగా హుండీ ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ పర్యవేక్షించగా ఏఈవోలు శ్రావణ్‌కుమార్, భవానీరామకృష్ణారావు, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్, నిరంజన్‌కుమార్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ రవీంద్రనాధ్ పాల్గొన్నారు.
సహస్ర కలశాభిషేకానికి నేడు అంకురార్పణ
భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో సహస్ర కలశాభిషేక మహోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ చేయనున్నారు. 4వ తేదీన సహస్ర కలశావాహనం, హవనం, పునర్వసుసేవ, చుట్టు సేవ నిర్వహిస్తారు. 5న సహస్ర కలశాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. అలాగే రంగనాయకస్వామి వారికి వార్షిక తిరుకల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇదే సమయంలో విశేష బోగ నివేదన, తిరువీధి సేవ చేయనున్నారు. సహస్ర కలశాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని 4, 5 తేదీల్లో నిత్యకల్యాణాలకు విరామం ఇవ్వనున్నారు. అదేవిధంగా పట్టాభిషేకం సైతం నిర్వహించరు. ఆరు నుంచి నిత్యకల్యాణాలను పునరుద్ధరిస్తారు.
Updated Date - 2023-02-03T12:34:27+05:30 IST