ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhadrachalam: మందకొడిగా ‘ముక్కోటి’ టికెట్ల విక్రయాలు

ABN, First Publish Date - 2023-12-02T13:00:09+05:30

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) ఉత్సవాలు.. ఉత్తరద్వారంలో స్వామి

భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) ఉత్సవాలు.. ఉత్తరద్వారంలో స్వామి దర్శనానికి హాజరయ్యే భక్తుల కోసం దేవస్థానం ఉత్తర ద్వార దర్శన టికెట్ల విక్రయాలు ప్రారంభించినా.. వాటి కొనుగోళ్లు ఇంకా జోరందుకోలేదు. ఆన్‌లైన్‌లో 2,350టికెట్లు అందుబాటులో ఉంచగా ఇప్పటి వరకు 656 టికెట్లు మాత్రమే భక్తులు కొన్నారు. ఇంకా 1,694 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.2వేలు విలువైన వీఐపీ సెక్టారు టికెట్లు 700 అందుబాటులో ఉంచగా 203 టికెట్లు అమ్ముడవగా ఇంకా 497 టికెట్లు ఉన్నాయి. రూ.వెయ్యి విలువగల సెక్టార్‌ ఏ టికెట్లు 300 అందుబాటులో ఉంచగా వాటిలో 114 టికెట్టను భక్తులు కొనుక్కోగా మరో 186 అందుబాటులో ఉన్నాయి. రూ.500 విలువ గల సెక్టారు బీ, సీ, డీ, టికెట్లు రూ.500చొప్పున మూడు సెక్టార్లలో 1500 అందుబాటులో ఉంచగా ఇప్పటి వరకు 226 టికెట్లు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా సెక్టారు సీలో వంద టికెట్లను అందుబాటులో ఉంచగా అన్ని టికెట్లను భక్తులు ముందుగానే కొనుగోలు చేయడం విశేషం. రూ.250 విలువ గల 500టికెట్లను ఈ సెక్టార్లో అందుబాటులో ఉంచగా 113 టికెట్లు మాత్రమే భక్తులు కొనగా మరో 387 టికెట్లు మిగిలి ఉన్నాయి.

Updated Date - 2023-12-02T13:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising