Bhadrachalam: 13నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
ABN, First Publish Date - 2023-12-06T10:54:50+05:30
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 13వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం
- భద్రాద్రిలో 22న తెప్పోత్సవం, 23న ఉత్తరద్వార దర్శనం
- జనవరి 8న విశ్వరూప సేవ
భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 13వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా 13 నుంచి 21వ తేదీ వరకు వివిధ అలంకారాల్లో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 22న స్వామివారికి గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనండగా, 23న వైకుంఠ ద్వారంలో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే జనవరి 8న స్వామివారికి విశ్వరూప సేవ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దేవస్థానం అధికారులు చేపట్టారు. ఆలయానికి రంగులు వేయడం, స్వాగత ద్వారాల ఏర్పాటు, హంస వాహనం తయారీ, చలువ పందిళ్ల నిర్మాణం, విద్యుత్ అలంకరణ తదితర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అలాగే 13నుంచి 22 వరకు పగల్‌పత్తు ఉత్సవాలు, 23 నుంచి జనవరి 2వరకు రాపత్తు సేవలు, జనవరి 3నుంచి 5 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా డిసెంబరు 13నుంచి 23వరకు నిత్యకల్యాణాలు నిలిపివేయనున్నారు.
Updated Date - 2023-12-06T10:54:52+05:30 IST