Charla: అన్నలూ.. దయచేసి మా గ్రామాల్లోకి రావొద్దు

ABN , First Publish Date - 2023-09-28T13:10:51+05:30 IST

మావోయిస్టులు తమ గ్రామాల్లోకి రావోద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వలస ఆదివాసీలు బుధవారం చర్ల(Charla)లో

Charla: అన్నలూ.. దయచేసి మా గ్రామాల్లోకి రావొద్దు

- చర్లలో ఆదివాసీల భారీ ర్యాలీ

- మావోయిస్టులకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయింపు

- పాల్గొన్న పది గ్రామాల ప్రజలు

చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): మావోయిస్టులు తమ గ్రామాల్లోకి రావోద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వలస ఆదివాసీలు బుధవారం చర్ల(Charla)లో భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ అన్నలు తమ గ్రామాల్లోకి రావోద్దని, తమ బతుకు తమని బతకనివ్వాలని సుమారు 10గ్రామాలకు చెందిన రెండు వందల మంది ఆదివాసీలు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి చర్ల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా చర్ల మండలంలోని చెన్నాపురం, ఎర్రంపాడు, బత్తినిపల్లి, కొర్కట్‌పాడు, ఆర్‌సీపురంతోపాటు ఇతర గ్రామాల ఆదివాసీలు భారీ సంఖ్యలో చర్ల మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం చర్ల ప్రధాన రహదారినుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘నక్షలైట్లు మా ఊరికి రావొద్దు’, ‘జనతన సర్కారు వద్దు.. తెలంగాణ సర్కారు ముద్దు’, ‘తీవ్రవాదం వద్దు అభివృద్ధి ముద్దు’, ‘నక్సలైట్లారా మీటింగ్‌లకు మమ్మల్ని పిలవద్దు’, ‘నక్సలైట్ల వ్యవస్థ వద్దు ప్రజాస్వామ్మమే ముద్దు’ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ఆదివాసీలు ప్రదర్శించారు. చర్ల- భద్రాచలం(Charla- Bhadrachalam) రహదారిపై కొద్దిపేపు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం చర్ల తహసీల్దార్‌ రమే్‌షకు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆదివాసీలు ఎదుక్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ సంఖ్యలో అనేక గ్రామాలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో చర్లలో ర్యాలీ నిర్వహించడం, భారీగా ప్లకార్డులు చూపించి నిరసన వ్యక్తం చేయడం నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్యనీయాంశంగా మారింది.

cherla.jpg

hhhhh.jpg

Updated Date - 2023-09-28T13:10:51+05:30 IST