Diwali: పటాసులు రెండు గంటలే కాల్చాలి..
ABN , First Publish Date - 2023-11-11T07:30:09+05:30 IST
దీపావళి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల ప్రజలు రాత్రి పూట 8 గంటల నుంచి 10 వరకే బాణసంచా
- రాత్రి 8 నుంచి 10 వరకే అనుమతి: సీపీ సందీప్
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల ప్రజలు రాత్రి పూట 8 గంటల నుంచి 10 వరకే బాణసంచా కాల్చాలని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య(Hyderabad CP Sandeep Sandlya) ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 12 నుంచి 15 వరకు కాలనీల్లో, రోడ్లపైన, బహిరంగ ప్రదేశాల్లో పటాసులు పేల్చుకోవడానికి అనుమతి ఉన్నట్లు సూచించారు.