TS Electon: తెలంగాణకు రెండో విడత కేంద్ర బలగాలు కేటాయింపు.. ఎంతమందంటే..!
ABN, First Publish Date - 2023-10-24T14:53:35+05:30
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మహబూబ్ నగర్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక పోస్టులతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రెండో విడత కేంద్ర బలగాలను కేంద్ర హోంశాఖ కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే తొలి విడతగా కేంద్ర బలగాలను పంపించింది. తాజాగా 100 కంపెనీల నుంచి 20 వేల మందిని కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్క టీంలో 60 నుంచి 80 మంది సిబ్బందిని నియమించింది. ఇప్పటికే అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పిఎఫ్, ఇండో బార్డర్ పోలీస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తెలంగాణకు చేరుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఇప్పటికే కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. ఇక రాచకొండ, హైదరాబాద్ సీపీలు కేంద్ర బలగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బందోబస్తుతో పాటు డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా కట్టుదిట్టం చేయనున్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించడానికి కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మహబూబ్ నగర్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక పోస్టులతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
Updated Date - 2023-10-24T16:31:40+05:30 IST