ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: బండి సంజయ్‌ని మార్చే చాన్సే లేదు

ABN, First Publish Date - 2023-05-22T03:27:45+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని ఆ పదవి నుంచి మార్చే అవకాశమే లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. సంజయ్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన నేతృత్వంలోనేఎన్నికలకు వెళతాం

కవిత అరెస్టునుసీబీఐ చూసుకుంటుంది

‘కర్ణాటక’ ప్రభావం రాష్ట్రంపై ఉండదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని ఆ పదవి నుంచి మార్చే అవకాశమే లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. సంజయ్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని తెలిపారు. అధ్యక్షుడి మార్పు అని జరుగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే తప్ప, పార్టీని ప్రజలు విశ్వసించే అవకాశం లేదంటూ సొంత పార్టీ నాయకులే చేసిన వ్యాఖ్యపై ఆయన స్పందించారు. ‘‘ఒక కేసులో ఎవరిని అరెస్టు చేయాలన్నది దర్యాప్తు సంస్థ పరిధిలోని అంశం. ఆధారాలు సేకరించిన తర్వాతే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేశారు. కవిత విషయంలోనూ అదే జరుగుతుంది. అంతే తప్ప బీజేపీకి సీబీఐతో సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండబోదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, బీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పారు. తమదంతా ఒకే కుటుంబమని.. పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలతో భేటీ కావడం సహజమేనని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం నడిపిస్తోందని అన్నారు.

తలకుమాసినోళ్లనే చేర్చుకుంటున్నారు..

మహారాష్ట్రలో తలకుమాసినోళ్లను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిపాలనను సలహాదారులకు వదలిపెట్టిన కేసీఆర్‌, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బ్రాంచ్‌ పెట్టారని విమర్శించారు. ‘‘బీఆర్‌ఎస్‌లో ఎవరినైనా చేర్చుకోండి.. కానీ తెలంగాణ పరిస్థితి ఏంటి..? విద్యార్థుల పరిస్థితి ఏంటి..? టీఎస్‌పీఎస్సీ పరిస్థితి ఏంటి..? వీటన్నింటినీ వదిలేసి.. దేశ్‌ కీ నేతా అని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారు. ఫ్లెక్సీలపై వేస్తే దేశ్‌ కీ నేతా అవ్వరు. ప్రగతి భవన్‌లోని బుల్లెట్‌ ప్రూఫ్‌ బాత్‌రూంల నుంచి మోదీపై రాళ్లు వేస్తే అవి బయటకు వెళ్లవు.. వారిపైనే పడతాయి. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి.. ఇవ్వకపోవడం మోసం కాదా..? రాష్ట్రంలో పంటల బీమా ఎందుకు అమలు చేయరు..?కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రజలు మెజారిటీ ఇస్తే.. సీఎంను ఎన్నుకోవడానికి మూడు చెరువుల నీళ్లు తాగారు. అలాంటిది ఈ కుటుంబ పార్టీలు కలిసి దేశాన్ని ఏలుతాయా..? ఇప్పుడిప్పుడే దేశం బాగుపడుతోంది. మళ్లీ వీరి చేతుల్లోకి వెళ్తే ఎలా మారుతుందో ప్రజలకు తెలియదా..?’’ అని పేర్కొన్నారు.

కావాలనే అధికారుల గైర్హాజరు..

ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణకు సంబంధించి గత ఏడాది కేంద్రం నిర్వహించిన కీలక సమావేశానికి రాష్ట్ర అధికారులు కావాలనే రాలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘రైతు బంధు పేరిట ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని ఇక్కడ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కేంద్రం ఒక్క ఎరువుల సబ్సిడీ మీదనే రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.18,254 ఇస్తోంది’’ అని తెలిపారు.

Updated Date - 2023-05-22T03:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising