BJP: చేరికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్.. ఢిల్లీకి బండి సంజయ్
ABN, First Publish Date - 2023-04-12T14:02:55+05:30
ఇతర పార్టీల నుంచి చేరికలపై తెలంగాణ బీజేపీ దృష్టిసారించింది.
హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి చేరికలపై తెలంగాణ బీజేపీ (Telangana BJP) దృష్టి సారించింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీ పెద్దలకు నివేదక ఇవ్వనున్నారు. అలాగే బీఆర్‌ఎస్(BRS) నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former Minister Jupalli Krishna Rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Former MP Ponguleti SrinivasReddy) చేరిక అంశంపై ఢిల్లీ పెద్దలతో బండి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etela Rajender) ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీలో ఇరువురి నేతల చేరికపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. జూపల్లి, పొంగులేటిని పార్టీలో చేర్చుకోవడం ఎంతో ప్రయోజకరమని, అంతే కాకుండా ఇతర అసంతృప్తి నేతలు కూడా చేరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూపల్లి, పొంగులేటి చేరికలను కమలం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Updated Date - 2023-04-12T14:20:48+05:30 IST