Kishan Reddy: 6 కాదు.. 60 గ్యారంటీలిచ్చినా కాంగ్రెస్‌ను నమ్మరు
ABN, First Publish Date - 2023-09-30T13:55:08+05:30
తెలంగాణకు కాంగ్రెస్ మరోసారి కుచ్చు టోపీ పెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణకు కాంగ్రెస్ (Telangana Congress) మరోసారి కుచ్చు టోపీ పెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి (BJP Leader Kishan Reddy) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆరు కాదు.. 60 గ్యారంటీలిచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. దేశాన్ని 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలుసన్నారు. పదేళ్ళుగా అధికారానికి దూరంగా.. కాంగ్రెస్ నేతలు ఆకలితో ఉన్నారని అన్నారు. తన పర్యటనలో ప్రధాని మోదీ (PM Narendra Modi) తెలంగాణకు కానుకలు ఇవ్వబోతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో స్వయంగా మంత్రులే ఓడిపోబోతున్నారని.. అందుకే సీఎం కేసీఆర్ (CM KCR) తొండి ఆట ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుంటే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ టూర్‌పై కేసీఆర్ ఇంట్లో కూర్చుండి కుట్రలు చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ కోసం కేంద్రం 9 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. కేసీఆర్ 90 రోజులే అధికారంలో ఉంటారని.. శాశ్వతంగా ఫార్మ్ హౌస్‌లో ఉండబోతున్నారన్నారు. కేసీఆర్ కో హటావో.. తెలంగాణకో బచావో ఇది రాష్ట్ర ప్రజల నినాదామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే గెలిచిన వాళ్లు బీఆర్ఎస్‌లో చేరుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-30T13:55:08+05:30 IST