Kishan Reddy: గ్యాస్ ధర తగ్గింపుపై బీఆర్ఎస్‌వి అర్థం పర్థం లేని ప్రేలాపణలు
ABN , First Publish Date - 2023-08-30T15:38:57+05:30 IST
మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో మాత్రమే అత్యధిక పెట్రోల్ ధర ఉంది. బెల్టు షాపులు ఏర్పాటు చేసి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోంది. ఒక చేతిలో ఆసరా పెన్షన్.. మరొక చేతిలో బీరు సీసాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పన్ను తగ్గించకపోవటం వలనే పెట్రోల్ ధర మండిపోతోంది. ప్రధాని పిలుపుతో తెలంగాణ మినహా..
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై (Kcr Government) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ ధర తగ్గింపుపై బీఆర్ఎస్ నేతలు (BRS) అర్థం పర్థం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో మాత్రమే అత్యధిక పెట్రోల్ ధర ఉంది. బెల్టు షాపులు ఏర్పాటు చేసి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోంది. ఒక చేతిలో ఆసరా పెన్షన్.. మరొక చేతిలో బీరు సీసాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పన్ను తగ్గించకపోవటం వలనే పెట్రోల్ ధర మండిపోతోంది. ప్రధాని పిలుపుతో తెలంగాణ మినహా.. అన్ని ప్రభుత్వాలు పన్నులు తగ్గించాయి. ఆర్టీసీ చార్జిలు, భూముల రిజిస్ట్రేషన్ పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. బీరు, బ్రాందీ, భూములు అమ్మి కేసీఆర్ ఉద్యోగులకు జీతాలిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పరస్పర అవగాహనతో కార్యాలయాలకూ భూములు కేటాయించుకున్నాయి. ఆరు నెలల ముందే మద్యం షాపులకు వేలం వేసిన ఘనత కేసీఆర్‌దే. గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపుతో పేదలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిపాలన ప్రజలు చూశారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. చెన్నమనేని వికాస్ దంపతులు బీజేపీలో చేరటం శుభపరిణామం. రాజకీయాల ద్వారా వికాస్ దంపతులు ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నా. మేధావులు సహా.. తెలంగాణలో అన్ని వర్గాల వారు బీజేపీలోకి రానున్నారు. చెన్నమనేని వికాస్ చేరికతో వేములవాడ ప్రాంతంలో బీజేపీకి మేలు జరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే. ఇద్దరికీ ఎంఐఎం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.