Kishan Reddy: ఈ 3 నెలలైనా హైదరాబాద్‌పై కేసీఆర్ దృష్టి పెట్టాలి
ABN , First Publish Date - 2023-07-28T15:43:39+05:30 IST
హైదరాబాద్ నుంచి 80 శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని, కానీ 8 శాతం కూడా హైదరాబాద్ (Hyderabad) బాగు కోసం కేటాయించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నిధులు ఇవ్వక కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసినా కూడా హైదరాబాద్ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. అంబర్‌పేటలో వర్షాలకు నీటమునిగిన కాలనీలను కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి 80 శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని, కానీ 8 శాతం కూడా హైదరాబాద్ (Hyderabad) బాగు కోసం కేటాయించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నిధులు ఇవ్వక కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసినా కూడా హైదరాబాద్ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఉండే మూడు నెలలు అయిన సీఎం కేసీఆర్ (CM KCR) హైదరాబాద్ గురించి ఆలోచించాలని కోరారు.