ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CAG Report: కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-08-06T12:23:14+05:30

హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక ఇచ్చింది.

హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ (CAG) రిపోర్టును ఆదివారం అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక ఇచ్చింది. 11 గ్రాంట్లకు రూ.75 వేల కోట్లు అధికంగా ప్రభుత్వం వ్యయం చేసిందని పేర్కొంది. రాష్ట్ర ఆదాయం అంచనా రూ. 2,21,687 కోట్లు.. వచ్చిన ఆదాయం రూ. 1,74,154 కోట్లు.. రెవెన్యూ లోటు 6,744 కోట్లని, రెవెన్యూలోటులో రూ.9,335 కోట్లకు పెరిగిందని కాగ్‌ తెలిపింది. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 1,09,992 కోట్లు కాగా కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్స్ రూ. 8, 619 కోట్లని, ప్రాణాళికేతర వ్యయం రూ. 32, 979 కోట్లు.. జీతాలకు రూ.30,951 కోట్లు.. వడ్డీ చెల్లింపులు రూ.19.161 కోట్లు.. మౌలిక వసతులకు రూ.28,308 కోట్లని కాగ్ పేర్కొంది.

నీటిపారుదల, వైద్యం, పంచాయతీరాజ్‌ శాఖలకు 34 శాతం అధికంగా ప్రభుత్వం ఖర్చు చేసిందని కాగ్ తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు పెట్టిందని, 289 రోజల పాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీని వినియోగించిదని, 259 రోజులపాటు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ సౌకర్యం వినియోగించిందని పేర్కొంది. 100 రోజలపాటు రూ.22,669 కోట్ల ఓవర్‌ డ్రాప్ట్‌కు ప్రభుత్వం వెళ్లిందని, 2020-21లో రూ.9,335 కోట్ల రెవెన్యూ లోటుకు రాష్ట్రం వెళ్లిందని స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోందని, రాష్ట్రం అప్పు జీఎస్టీ (GST)లో 27.40 శాతమని కాగ్‌ నివేదికలో పేర్కొంది. 2021-22లో రాష్ట్రంలో పన్ను ఆదాయం 37 శాతం కాగా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 44 శాతం తగ్గాయంది. జీఎస్టీకి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

Updated Date - 2023-08-06T12:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising