TS Congress: రేవంత్ తీరుపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు.. దేనికోసమంటే..!
ABN , First Publish Date - 2023-08-19T17:10:53+05:30 IST
అయినా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. పైగా స్టార్ క్యాంపెనర్‌గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొనలేదు. అలాంటి వ్యక్తి జనగామ జిల్లాకు చేసిన సిఫార్సును ఎలా పరిగణనలోకి తీసుకున్నారు?. స్థానికేతరులను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం స్థానిక కార్యకర్తలను తీవ్రంగా కలిసి వేస్తోంది.
ఢిల్లీ: ఉదయపూర్ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా జనగామ డీసీసీ అధ్యక్ష నియామకం జరిగిందని జనగామ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. లింగాజీ వాపోయారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఫిర్యాదు చేయడం కోసం ఢిల్లీ వచ్చా. కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి అనేక పార్టీలు మారీ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన జనగామ జిల్లా వాసి కాదు. పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లాకు చెందినవాడు. కాంగ్రెస్ మార్గదర్శకాల్లో డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యేవారు అదే జిల్లాకు చెందిన వారై ఉండాలన్న నిబంధన ఉంది. జనగామ, భువనగిరి, నిర్మల్ జిల్లాల అధ్యక్షులుగా నియమితులైన వారు సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించారంటూ సిఫార్సు లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించడమే. అలాగే భువనగిరి, జనగామ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు చేసినట్లు రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సులను కేవలం ఈ రెండు జిల్లాలకే ఎందుకు తీసుకున్నారు? రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?, అయినా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. పైగా స్టార్ క్యాంపెనర్‌గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొనలేదు. అలాంటి వ్యక్తి జనగామ జిల్లాకు చేసిన సిఫార్సును ఎలా పరిగణనలోకి తీసుకున్నారు?. స్థానికేతరులను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం స్థానిక కార్యకర్తలను తీవ్రంగా కలిసి వేస్తోంది. జిల్లాల అధ్యక్ష నియామకాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. 35 జిల్లాల్లో 22 అగ్రవర్ణ కులాలకే ఇచ్చారు. కేవలం 7 మాత్రమే బీసీలకు ఇచ్చారు. జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోంది. కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారు. కొమ్మూరి ఏ జిల్లా వ్యక్తో అధిష్టానానికి తెలియదు. కాంగ్రెస్ రాజ్యాంగం, బైలాస్ ప్రకారం స్థానిక వ్యక్తికే డీసీసీ పదవి ఇవ్వాలి.’’ అని లింగాజీ డిమాండ్ చేశారు.