ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: బీఆర్ఎస్‌, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ ‘ప్రజాకోర్టు’

ABN, First Publish Date - 2023-08-12T19:57:13+05:30

కాంగ్రెస్(Congress) ప్రచార ప్రారంభ సభను బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిచింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా “తిరగబడదాం- తరిమికొడదాం” ఛార్జ్‌షీట్ పోస్టర్‌(Charge sheet poster)ను ఆవిష్కరించారు.

హైదరాబాద్: కాంగ్రెస్(Congress) ప్రచార ప్రారంభ సభను బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిచారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా “తిరగబడదాం- తరిమికొడదాం” ఛార్జ్‌షీట్ పోస్టర్‌(Charge sheet poster)ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క, సీతక్క, మహేష్ కుమార్ గౌడ్, సంపత్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే ప్రజా సమస్యలపై ‘ప్రజాకోర్టు‘ నిర్వహించనున్నది. ‘ప్రజాకోర్టు‘ జడ్జీగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యవహరించనున్నారు. ఈ ప్రజాకోర్టులో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను విచారించనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం తెలిపింది. నెల రోజుల పాటు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. 12,000 గ్రామాల్లో, 3,000 డివిజన్ స్థాయిలల్లో కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రజా సమస్యల కోసం 7661 899 899 ఫోన్ నంబర్‌తో మిస్డ్ కాల్ ప్రోగ్రాంను రూపొందించారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫ్యలాలను ఎండగట్టేందుకు పోస్ట్ కార్డుల కార్యక్రమాన్ని ప్రకటించింది.

“తిరగబడదాం- తరిమికొడదాం” స్లోగన్ లక్ష్యాలు

1. బీఆర్ఎస్ వైపల్యాలు 12000 గ్రామాల్లో 3వేల డివిజన్ స్థాయిలల్లో ప్రజా సమావేశాలు

2. చార్జీషీట్ విడుదల, పోస్టుకార్డు, మిస్డ్‌కాల్ నెంబర్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు

3. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా కోర్టుల నిర్వహణ.

4. నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు

5. 75 లక్షల ఇండ్లలో ప్రభుత్వ వైపల్యాలపై చార్జీషీట్ అందించడం

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వేగంగా వెళ్లేలా కాంగ్రెస్ ప్లాన్ రూపొందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌కు పేరు వచ్చేలా పలు నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నది.

Updated Date - 2023-08-12T20:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising